పోలీసులను ఆశ్రయించిన పవన్ తమ్ముడు

0Shiva-Balaji-filed-Police-Caseటాలీవుడ్ యాక్టర్ శివ బాలాజీ ప్రస్తుతం కాటమరాయుడులో పవన్ కళ్యాణ్ తమ్ముడి కేరక్టర్ చేస్తున్నాడు. గతంలో ఆర్య వంటి సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసిన శివ బాలాజీకి ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. సోలో హీరోగా కూడా కొన్ని మూవీస్ లో నటించినా.. అవేమీ అంతగా ఆడకపోవడంతో కెరీర్ పెద్దగా ముందుకు కదల్లేదు. అందుకే కేరక్టర్ నటుడిగా స్థిరపడిపోయాడు.

మార్చ్ 6న ఈ కాటమరాయుడి పెద్ద తమ్ముడు.. పవన్ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయినట్లుగా ఓ పోస్ట్ పెట్టాడు. సినిమా రిలీజ్ 24నే అని.. అయితే ప్రొడ్యూసర్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం అందరు ఫ్యాన్స్ మాదిరిగానే తాను కూడా వేచి చూస్తున్నానని అన్నాడు శివబాలాజీ. కానీ కొందరి నుంచి మాత్రం తీవ్రమైన భాషలో దూషణలు పడాల్సి వచ్చింది. దీనికి బాగా హర్ట్ అయిన శివబాలాజీ.. మొదట సున్నితంగానే హెచ్చరించాడు. సోషల్ మీడియాను ఇలా అనాగరికంగా ఉపయోగించుకోవడం తగదని చెప్పాడు.

అయితే.. అవతలి వ్యక్తి మాత్రం తన భాషను ఏ మాత్రం మార్చుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన శివ బాలాజీ.. ఇంటర్నెట్ వేదికగా జరిగే ఇలాంటి వాటిని అడ్డుకునే ప్రయత్నమే ఇది అన్నాడు. శివబాలాజీకి.. అతన్ని తిట్టిన వ్యక్తికి మధ్య కొంత సంభాషణ జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. చాట్ రికార్డ్స్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తామంటున్నారు పోలీసులు.