యూజ‌ర్ల‌కు షాక్‌: జియో గుడ్ బై

0



jioగ‌త ఆరు నెల‌లుగా ఇండియ‌న్ టెలికం రంగంలో రిల‌య‌న్స్ జియో క్రియేట్ చేసిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. జియో ఉచిత డేటా, వాయిస్ ఆఫ‌ర్ల కాల‌ప‌రిమితి ముగిసింది. ప్రైమ్ మెంబర్‌షిప్, సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ల గడువు ముగియడంతో ఇప్పటికీ రీచార్జ్ చేసుకోని వినియోగదారులకు గుడ్‌బై చెప్పేందుకు జియో సిద్ధమైంది. వాస్త‌వానికి ఈ నెల 15తోనే జియో ఉచిత ఆఫ‌ర్ గ‌డువు ముగిసింది.

అయినా యూజ‌ర్ల‌కు క‌టిఫ్ చెప్ప‌కుండా రీచార్జ్ చేయించుకోవాలంటూ మెసేజ్‌లు ఇస్తోంది. ఇక ఇప్పుడు ఒక్క‌సారిగా క‌నెక్ష‌న్ క‌ట్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. సెప్టెంబర్ మొదలు దాదాపు ఆరు నెలలకు పైగా ఉచిత ఆఫర్లతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్న రిలయన్స్ జియో… ఏప్రిల్ 1 నుంచి చార్జీలు వసూలు మొదలుపెట్టింది. రూ.99కి సంవత్సరం మేర ‌ప్రైమ్‌ మెంబర్‌షిప్ ప్రకటించింది.

ఆ త‌ర్వాత స‌మ్మ‌ర్ స‌ర్‌ఫ్రైజ్ ఆఫ‌ర్ కింద రూ. 303తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెల‌ల పాటు రోజుకు 1జీబీ డేటా ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్ గ‌డువు ఏప్రిల్ 15తో ముగిసింది. అయినా చాలా మంది దీనిని వాడుకోలేదు. దీంతో అదే స్టైల్లో ఆఫర్ ‘ధనాధన్ ఆఫర్’ను తీసుకొచ్చింది. రూ.309తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు రోజుకు 1జీబీ డేటా సేవలు అందుకోవచ్చు.

ఫ్రైమ్ మెంబ‌ర్ షిఫ్ లేక‌పోయిన వారికి జియో మ‌రో ఆఫ‌ర్ ఇచ్చింది. సిమ్ డిస్‌క‌నెక్ట్ అయిన వారు రూ.408తో రీచార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇందులో రూ.99 ప్రైమ్ మెంబర్‌షిప్‌కు, మిగిలిన రూ. 309 ధ‌నాధ‌న్ ఆఫ‌ర్‌కు వ‌ర్తిస్తుంది.