గుర్తు పట్ట లేనంతగా తయారైన హీరోయిన్

0ఈ ఫోటో చూశారా? ఈమెను గుర్తు పట్టారా? నో ఐడియా అనేయకండి. ఒకప్పుడు తన హాట్ అందాలతో హీటెక్కించి.. వాలు చూపులతో పిచ్చెక్కించి.. నిద్ర లేని రాత్రులతో వెర్రెక్కించేసిన భామ. ఇన్ని చెప్పేసిన తర్వాతైనా ఆమెను గుర్తు పట్టారా? నో.. అంటారా?అయితే.. ఆమె ఎవరో మేమే చెప్పేస్తాం. మాస్ మహరాజ్ రవితేజ నటించిన ఇడియట్ మూవీ గుర్తుకు వచ్చిందా? అందులో హీరోయిన్ గా నటించిందే.. రక్షిత.. ఆమే..ఈమె.

ఇన్ని ఆనవాళ్లు చెప్పిన తర్వాత కూడా గుర్తు పట్టలేనంతగా మారిపోయిన రక్షితను చూసిన తర్వాత మనసు చేదెక్కిపోవటం ఖాయం. హాట్ హాట్ ఉండే రక్షిత ఇప్పుడింత హెవీ వెయిట్ ఎలా? అంటే.. ఒబెసిటి కారణమని చెబుతున్నారు. ఇడియట్ తర్వాత.. టాలీవుడ్ అగ్రహీరోలైన మహేశ్ బాబు.. తారక్.. నాగార్జున లాంటి హీరోలతో స్క్రీన్ మీద రొమాన్స్ చేశారు.

ఊహించిన రీతిలో పెరిగిపోతున్న బాడీని కంట్రోల్ చేయలేక ఆమె.. చిత్రరంగానికి దూరమయ్యారని చెప్పాలి. కన్నడ నిర్మాత ప్రేమ్ ను పెళ్లాడిన రక్షిత తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు. వెండి తెరకు దూరమైనా.. వెండి తెర మీదకు సినిమాలు ఎక్కించేస్తూ..ఆ లోటును తీరుస్తున్న ఆమె.. ఇప్పటివరకూ రెండు కన్నడ సినిమాల్నిప్రొడ్యూస్ చేయటం గమనార్హం. ఈ మధ్యన జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆమెను క్లిక్ చేసిన ఈ ఫోటోలను చూసిన వారంతా.. షాక్ తినే పరిస్థితి. ఇడియట్ ఫ్రేమ్ ను మనసులో సేవ్ చేసుకున్న వారికి.. రక్షితను ఇలా చూడటం.. జీర్ణించుకోవటం చాలా కష్టమైన పనేనని చెప్పక తప్పదు.Rakshitha-Shocking-look