టేపుల లీక్స్ : దత్తా వివాదం మరింత ముదిరింది

0

బాలీవుడ్ ను కుదిపేస్తున్న తనూశ్రీ దత్తా వివాదం మరింతగా ముదిరింది. దాదాపు పది సంవత్సరాల క్రితం వచ్చిన ‘హార్న్ ఓకే ప్లీజ్’ షూటింగ్ లో తనతో నటుడు నానా పటేకర్ అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ తనూశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల వారికి షాక్ ఇస్తున్నాయి. నానా పటేకర్ పై మాత్రమే కాకుండా ఇంకా పలువురిపై కూడా తనూశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ రెండుగా చీలింది. ఒక వైపు తనూశ్రీ దత్తాకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆమెపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడికి దిగుతున్నారు.

తాజాగా ఒక బాలీవుడ్ మీడియా హార్న్ ఓకే ప్లీజ్ నిర్మాత సమి సిద్దిఖి – దర్శకుడు రాకేష్ సారంగ్ – నటుడు రజా మురద్ – గజేంద్ర చౌహాన్ లపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఆ స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన ఆడియో టేపులు తాజాగా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ టేపులు సంచలనం అవుతున్నాయి. తనూశ్రీ దత్తా – నానా పటేకర్ గురించి ఈ నలుగురు మాట్లాడిన మాటలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

రజా మురద్ మాట్లాడుతూ.. తనుశ్రీ ఓవర్ గా రియాక్ట్ అవుతుంది. కాస్త టచ్ చేసినందుకు మరీ ఇంతగా రియాక్ట్ అవ్వాలా అన్నాడు. పది సంవత్సరాల తర్వాత ఈ పంచాయితీ ఏంటీ అంటూ గజేంద్ర చౌహాన్ మాట్లాడినట్లుగా ఆ టేప్ లో ఉంది. ఇక రాకేష్ సారంగ్ ఈ విషయంపై స్పందిస్తూ బిగ్ బాస్ ఎంట్రీ కోసమే తనూశ్రీ ఈ నాటకం ఆడుతుంది అన్నాడు. ఇక నిర్మాత సమీ మరింత దారుణంగా స్పందించాడు. ఆ రోజు తనూశ్రీ పీరియడ్స్ లో ఉన్నట్లుగా తాను భావిస్తున్నాను. అందుకే ఇంతగా రియాక్ట్ అవ్వడం ప్రవర్తించడం చేస్తుందేమో అన్నాడు.

ఈ నలుగురి చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. బాలీవుడ్ లో కూడా వీరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Please Read Disclaimer