ప్రభాస్ గురించి శ్రద్దా ఏమంటోందంటే..

0ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత బాగా ఉందని బాలీవుడ్ ముద్దుగుమ్మలకు తెలిసినట్టు ఉంది. అందుకే ఇక్కడ అవకాశాలు రాగానే వాలిపోతున్నారు. స్టార్ హీరోలు అంటే చాలు ఏ మాత్రం నో చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం శ్రద్దా కపూర్ అయితే టాలీవుడ్ అంటే చాలు ప్రేమలు కురిపిస్తోంది. అమ్మడు మొదట్లో సాహో సినిమా ఒప్పుకోవడానికి కొంచెం అయిష్టత చూపినప్పటికి ఆ తరువాత వెంటనే ఒకే చెప్పింది.

ప్రస్తుతం సాహో సినిమాతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో కూడా నటిస్తోంది. ఇక ఆ సినిమాలకు సంబంధించిన కొన్ని విషయాల గురించి అమ్మడు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. మెయిన్ గా ప్రభాస్ గురించి అయితే ఒక రేంజ్ లో పొగిడేసింది. ప్రభాస్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. అతను చాలా మంచి వ్యక్తి. నాకు జెంటిల్ మెన్ లా కనిపిస్తాడు. హ్యూమన్ బీయింగ్ కూడా. ఎలాంటి సన్నివేశాల్లో అయినా సరే చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. అది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని శ్రద్దా వివరించింది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని సినిమాలను ఆల్ మోస్ట్ ఫినిష్ చేశాను అని చెబుతూ.. సైనా నెహ్వాల్ షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉందని ఆమె వివరణ ఇచ్చారు. సాహో సినిమాలో శ్రద్దా పాత్ర కథకు చాలా ముఖ్యమని తెలుస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ సగానికి పూర్తయినట్లు సమాచారం. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.