స్త్రీకి సూపర్ హిట్ టాక్..శ్రద్ద సాహోకు ప్లస్సే!

0‘ఏ సమయానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.. ” తెలుగులో ఒక క్లాసిక్ సాంగ్ ఉంది. నిజమే మరి నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? నెక్స్ట్ మినిట్ సంగతే చెప్పలేనపుడు ఏడాది తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేరు కదా! ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ కు శ్రద్ధ కపూర్ ను హీరోయిన్ గాసైన్ చేసినప్పుడు ఆమె మంచి ఊపులో హిట్ల మీద ఉంది. కానీ తర్వాత వరసగా ఆమె సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ డిజప్పాయింట్ చెయ్యగా.. ‘హసీనా పార్కర్’ సినిమాకు చాలా కష్టపడినా ఫలితం దక్కలేదు. ఇక అందరి దృష్టి ఆమె కీలకపాత్రలో నటించిన హర్రర్ థ్రిల్లర్ ‘స్త్రీ’ పై పడింది.

ఆగష్టు 31 న రిలీజ్ అయిన ఈ ‘స్త్రీ’ ప్రేక్షకులనే కాదు రివ్యూయర్లను కూడా భారీగా మెప్పించింది. మొదటి రోజు రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. దీంతో ‘సాహో’ రిలీజ్ అయ్యే సమయానికి ఫ్లాప్ హీరోయిన్ శ్రద్ధ ను తీసుకున్నారనే చెడ్డపేరు నిర్మాతలకు ..బాలీవుడ్ లో క్రేజ్ లేని హీరోయిన్ ఆయినే విమర్శలు రాకుండా శ్రద్ధ కూడా తప్పించుకుంది. శ్రద్ధ తాజా చిత్రం సూపర్ హిట్ దిశగా పయనిస్తోందని ట్రేడ్ అనలిస్టులు వెల్లడిస్తున్నారు. దీంతో ‘సాహో’ రిలీజ్ అయ్యే సమయానికి మళ్ళీ శ్రద్ద కపూర్ బాలీవుడ్ లో ప్రభాస్ సినిమాకు ప్లస్ గా మారనుంది.

దీంతో పాటు షాహిద్ కపూర్ తో ‘బత్తి గుల్ మీటర్ చాలూ’ అనే మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ బేస్డ్ ఫిలిం తో ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామాల్లో విద్యుత్ చౌర్యం కాన్సెప్ట్ మీద సాగే ఈ డ్రామా లో ఇంట్రెస్టింగ్ కోర్ట్ సీన్స్ ఉన్నాయట. సో.. శ్రద్ధ సాహో కు బర్డెన్ కానే కాదు.. ప్లస్సే!