ప్రభాస్ కు వర్షం పాప సెట్టయినట్టేనా?

0Prabhas-and-Shraddha-Kapoorఇంతకీ ప్రభాస్ తదుపరి హీరోయిన్ ఎవరండీ బాబూ? ఇప్పుడు టాలీవుడ్ అంతా ఇదే ప్రశ్న వేస్తున్నారు. ఒక ప్రక్కన మొన్నటివరకు ”సాహో” సినిమాలో కూడా హీరోయిన్ అనుష్కే అంటూ ప్రచారం సాగింది కాని.. ఇంకా తన వెయిట్ తగ్గకపోవడంతో.. అలనాటి ఆ మేటి లుక్స్ ఏవీ రాకపోవడంతో.. అనుష్క ఈ పాత్ర నుండి తప్పుకుందనే టాక్ వచ్చింది. ఇంతకీ ఈ హీరోయిన్ రోల్ ఎవరు చేస్తున్నారు?

తొలినుండీ బాహుబలి ఇచ్చిన క్రేజ్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ చాలా జాగ్రత్తగా తన సాహో సినిమా క్యాస్టింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ నుండి కోలీవుడ్ నుండి కూడా యాక్టర్లను దింపడానికి కారణంగా ఏంటంటే.. ఆ మార్కెట్లకు సినిమాను ఒరిజినాలిటీ మిస్సవ్వకుండా అమ్మేయాలనే. అయితే బాలీవుడ్ కోసం ఇప్పుడు హీరోయిన్ ను కూడా అక్కడినుండే తీసుకుంటున్నాడట. ముందుగా అనుకున్నట్లు పరిణీతి చోప్రా.. ఆలియా భట్ వంటి పేర్లు కాకుండా.. ఇప్పుడు కొత్తగా మరో పేరు వినిపిస్తోంది. హిందీ ‘వర్షం’ సినిమాలో యాక్ట్ చేసిన శ్రద్దా కపూర్ ఉంది చూశారూ.. ఇప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఈమెను ఓకె చేశారట. ఇటు బడ్జెట్ అటు సూటయ్యే ఫిజిక్.. రెండూ ఈమెకే ఉన్నాయని తలంచి.. ఈమెను తీసుకున్నట్లు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కాని ప్రభాస్ అండ్ టీమ్ మాత్రం ఇంకా దీనిని ధృవీకరించలేదు.

ఆల్రెడీ సాహో సినిమాను ముంబాయ్ లో కాస్త షూట్ చేసిన దర్శకుడు సుజిత్ అండ్ టీమ్.. త్వరలో అబుధబి.. మరియు ఇతర యురోపియన్ కంట్రీస్ లో షూట్ చేసి.. హైదరాబాద్ లో ఆఖరి షెడ్యూల్ వేసి ముగించాలని ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం ఈ సినిమాలో చివరకు ఏ హీరోయిన్ ఫైనల్ అవుతుందో.