‘సాహో’ బ్యూటీకి డెంగీ ఫీవర్

0

క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న మేటి యువకథానాయికగా శ్రద్ధా కపూర్ పేరు మార్మోగిపోతోంది. టాలీవుడ్ – బాలీవుడ్ లో ఈ అమ్మడు ఫుల్ బిజీ. ఓవైపు టాలీవుడ్ లో `సాహో` షూటింగ్ చేస్తూనే – మరోవైపు బాలీవుడ్ లో స్త్రీ – బట్టి గుల్ మీటర్ చాలు వంటి చిత్రాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు ఇటీవలే రిలీజై హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక `సాహో` చిత్రీకరణ ముగించుకుని ఆ వెంటనే ఎలాంటి గ్యాప్ లేకుండా సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించేందుకు సెట్స్ పైకి వెళ్లిపోయింది. మూడు పదుల వయసులో శ్రద్ధా ఏడాదికి నాలుగైదు సినిమాల్లో నటించేస్తూ 20-25కోట్ల ఆదాయంతో .. ఏ ఇతర స్టార్ హీరోయిన్ కి తీసిపోని రీతిలో దూసుకెళ్లిపోతోంది. మరోవైపు వాణిజ్య ప్రకటనలతోనూ అంతే భారీగా ఆర్జిస్తోంది.

అయితే జీవితం అంటే సంపాదన ఒక్కటేనా? కాస్తంత విశ్రాంతి కూడా అవసరం. ఆ విశ్రాంతి లేకపోవడం వల్లనేమో శ్రద్ధా ఇటీవల బాగా అలసిసొలసి పోయిందిట. ఉన్నట్టుండి సడెన్ గా శ్రద్ధా ఆస్పత్రిలో చేరడం ప్రస్తుతం చర్చకొచ్చింది. అయితే దీనికి కారణం హెక్టిక్ షెడ్యూల్స్ వల్ల అనారోగ్య ప్రభావం కానే కాదు. శ్రద్ధాకి ప్రమాదకర డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఇది ఓ దోమ కాటువల్ల వచ్చే జ్వరం అన్న సంగతి తెలిసిందే. తెల్ల రక్త కణాల్ని హరించే ప్రమాదకర వైరస్ శరీరంలో ప్రవేశిస్తుంది. సరైన సమయంలో వ్యాధికి చికిత్స అందకపోతే ప్రాణాలే పోతాయి. అయితే శ్రద్ధాకి అన్ని ఏర్పాట్లు సజావుగానే సాగుతున్నాయిట.

మరోవైపు సైనా నెహ్వాల్ బయోపిక్ చిత్రీకరణ ఆగలేదు. శ్రద్ధా లేకపోయినా చిన్ననాటి సైనా పాత్రధారిపై షూటింగ్ చేస్తున్నారట. సెప్టెంబర్ 27న శ్రద్ధాకు డెంగ్యూ ఉందని తేలింది. అప్పటి నుంచి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చేసింది. ఈ బ్రేక్ లోనే ఇతర పార్ట్ షూటింగ్ ని ఆమోల్ & భూషణ్ కుమార్ టీమ్ షురూ చేసింది. ప్రఖ్యాత ముంబై మిర్రర్ తో టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ మాట్లాడుతూ -“నెలలుగా హెక్టిక్ షెడ్యూల్స్ తో నలిగిపోతోంది శ్రద్ధా. అది ఆరోగ్యంపైనా ప్రభావం చూపించింది. ఇంతలోనే డెంగ్యూ జ్వరం వచ్చింది. త్వరలోనే తన ఆరోగ్యం గురించి తిరిగి సెట్స్ కి ఎప్పుడు వస్తుందో చెబుతాం. సాధ్యమైనంత తొందరగానే కోలుకుని రావాలనే కోరుకుంటున్నాం“ అని తెలిపారు.
Please Read Disclaimer