సైనా రోల్ లో శ్రద్దా!! పనవుద్దా గురూ?

0Shraddha-Kapoor-to-play-Saina-nehwalఇప్పుడు ఇండియాలో బయోపిక్ ల హడావుడి ఎక్కువైన సంగతి తెలిసిందే. సాధారణంగా హాలీవుడ్ లో అయితే.. ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా కూడా చాలా లెజండరీ అనిపించుకున్నాక.. ఆ తరువాత అతని మీద చాలా పుస్తకాలు వచ్చాక.. అప్పుడు వారిపై సినిమా గట్రా వస్తుంటాయి. కాని మన దగ్గర మాత్రం.. మేరి కోం ఇంకా ఆడుతున్నప్పుడే.. ధోని ఇంకా కెప్టెన్ గా ఉన్నప్పుడే.. సచిన్ మొన్ననే రిటైరైన వెంటనే.. వారిపైన సినిమాలు వచ్చేశాయి. ఒక్క బాగ్ మిల్కా బాగ్ అంటూ మిల్కా సింగ్ పై తీసిన సినిమా తప్పిస్తే.. తక్కినవన్నీ కూడా సదరు స్పోర్ట్స్ పర్సనాలిటీలకు పారితోషకం ఇచ్చి మరీ షూట్ చేసినవే.

తాజాగా సైనా నెహ్వాల్ జీవిత కథను కూడా ఒక సినిమాగా తీయాలని యోచిస్తున్నారు కొందరు. అలాగే సానియా మీర్జా కథ కూడా సినిమాగా రానుంది. అయితే సానియాపై వచ్చే సినిమా గురించి పెద్దగా క్లారిటీ లేదు కాని.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రాబోయే సినిమా మాత్రం రెడీ అయిపోతోంది. ఈ సినిమాలో సైనా రోల్ ను శ్రద్దా కపూర్ చేయనుందట. ఏదో అందంగా ఉంటుందనే మాట తప్పిస్తే.. ముద్దుగా బొద్దుగా ఉండే శ్రద్దాకు స్పోర్ట్స్ గాళ్ లుక్ అయితే లేదు. అదే విధంగా అమ్మడికి ముఖంలో అసలు హావభావాలు పలికించడమే రాదు. ఏదో ఏడుపుగొట్టు లవ్ స్టోరీలకు నప్పేస్తోంది కాని.. మరీ దారుణంగా క్రేజ్ ఉందని చెప్పి బయోపిక్ లకు కూడా తీసుకోవడం ఏంటి గురూ? అసలు ఈ హీరోయిన్ తో ఆ బయోపిక్ పనవుద్దేంటండీ!!