అపోలో జివికె పెళ్లి అంటే మాటలా

0సామాన్య ప్రేక్షకులకు జివికె మనవరాలు అంటే వెంటనే గుర్తురాకపోవచ్చు కానీ అఖిల్ తో ఎంగేజ్మెంట్ దాకా వచ్చి మిస్ అయిన శ్రియా భూపాల్ అంటే వెంటనే ఫ్లాష్ అవుతుంది. కారణాలు ఏవైనా అదంతా ఇప్పుడు గతం కానీ శ్రియా భూపాల్ పెళ్లి సందడి పారిస్ నుంచి హైదరాబాద్ దాకా ఓ రేంజ్ లో జరగబోతోంది. ప్రస్తుతం వియ్యం అందుకున్న అపోలో జివికె కుటుంబాలు సకుటుంబ సపరివార సమేతంగా పారిస్ దగ్గర్లో ఉన్న చంటిల్లి కోటలో ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ తాలూకు సంబరాలు మొత్తం అక్కడే జరుగుతున్నాయి. రామ్ చరణ్ సతీసమేతంగా అక్కడే ఉన్నాడు. నిన్న సోషల్ మీడియాలో ఆ పిక్స్ వైరల్ అయ్యాయి కూడా. జివికె రెడ్డి మానవరాలిగా ఉన్న గుర్తింపుతో పాటు స్వంతంగా సంస్థను కూడా నడుపుతున్న శ్రియా భూపాల్ పెళ్లి అపోలో కుటుంబానికి చెందిన ఆనందిత్ రెడ్డి తో కొద్దీ నెలల క్రితమే ఫిక్స్ అయ్యింది. పరిమితంగా ఆహ్వానించిన ప్రీ వెడ్డింగ్ పారిస్ లో పూర్తి చేసుకుని ఆ తర్వాత హైదరాబాద్ రానున్నారు.

జులై 6న అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో ఈ వివాహం జరగనుంది. ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న వేడుకలో శ్రియ సోదరుడు కృష్ణ భూపాల్ తో పాటు అతని భార్య దియా వాళ్ళ తల్లితండ్రులతో పాటు అపోలో ప్రతాప్ రెడ్డి పరివారం మొత్తం అక్కడే ఉన్నారు. అందుకే బోయపాటి శీను సినిమాకు ముందే ప్లాన్ చేసుకున్న బ్రేక్ ఇచ్చి చరణ్ అక్కడికి వెళ్ళిపోయాడు. తరుణ్ తహిల్లని డిజైన్ చేసిన ప్రత్యేక దుస్తుల్లో శ్రియ భోపాల్ కాస్ట్యూమ్స్ తో ఔరా అనిపిస్తుండగా సినిమా హీరోలకు ఏ మాత్రం తీసిపోని అందంతో ఆనందిత్ రెడ్డి అందరి దృష్టి తనవైపు ఉండేలా చేసుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వ్యాపార కుటుంబాల పెళ్లి కాబట్టి హైదరాబాద్ లో జరిగే వేడుక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహకే అందటం లేదు. దేశవ్యాప్త ప్రముఖులతో పాటు తారాలోకం మొత్తం తరలి రానున్న ఈ పెళ్లి ఈ దశాబ్దంలోనే గ్రాండ్ వెడ్డింగ్ గా అంచనా వేస్తున్నారు