శ్రియను మర్చిపోవడం కష్టమే

0తెలుగు సినిమా ప్రపంచంలో ఒక ఏడాదిలో ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. పరభాషా నుంచి వచ్చినా బయటి దేశం నుంచి స్పెషల్ సాంగ్స్ కోసం వచ్చినా ఆడియెన్స్ కి నచ్చితే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. ఇక కొంత మంది పరభాషా హీరోయిన్లను ఎన్నేళ్లైనా మర్చిపోవడం జరగదు. ఆ తరహాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లలో శ్రీయ ఒకరు. అమ్మడు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగిన సంగతి తెలిసిందే.

దాదాపు గత పదిహేనేళ్ల నుంచి స్టార్ హీరోలందరిని కవర్ చేసింది. అప్పుడెప్పుడో 2002 లో బాలయ్యతో చెన్నకేశరెడ్డి సినిమా చేసిన ఈ బ్యూటీ మళ్లీ 2018లో అదే బాలయ్యతో 16 ఏళ్ల తరువాత సినిమా చేసింది అంటే అమ్మడి కెరీర్ ఎలా కొనసాగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవల ఒక రష్యన్ యువకుడిని పెళ్లి చేసుకున్న శ్రియ హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే తన ఫొటో షూట్స్ తో అమ్మడు ఎప్పటిలానే ఆకట్టుకుంటోంది.

ఒక స్పెషల్ ఫొటో గ్రాఫర్ తీసిన ఫొటో అని చెబుతూ అమ్మడు ఇచ్చిన స్టిల్ చాలా హాట్ గా ఉంది. గ్లామర్ అందాలు ఇప్పట్లో తగ్గేలా లేవని అమ్మడు చెప్పకనే చెప్పేసింది. బ్లాక్ డ్రెస్సులో శ్రియ నవ్వుతూ ఉండడం చూసి మర్చిపోవడం కష్టమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ప్రస్తుత శ్రీయ రెండు తెలుగు సినిమాల్లో అలాగే తమిళ్ హిందీలో ఒక్కో సినిమా చేస్తోంది.