నేనున్నాను అంటున్న శ్రియ

0సీనియర్ హీరోయిన్ శ్రియను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.. తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. తమిళ సినిమాలు కూడా చేసి సౌత్ అంతా పాపులర్ అయింది. హిందీ సినిమాలను కూడా చక్కగా కవర్ చేసిన ఈ సుందరి కొద్ది నెలల క్రితం తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ను మనువాడింది. సినిమాలనుండి కాస్త గ్యాప్ తీసుకున్నట్టు అనిపించింది గానీ అలా ఏం జరగలేదు. సినిమాలను ఎంచక్కా కంటిన్యూ చేస్తోంది.

సినిమాలు మాత్రమే కాదు జోరుగా ఫోటోషూట్స్ ల్ పాల్గొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ నిండా ఫోటోలే ఫోటోలు. ఇక రీసెంట్ గా ఆమె కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ ఫోటోల్లో బ్లాక్ కలర్ డిజైనర్ గౌన్లో తళుక్కున మెరిసింది శ్రియ. థై హై స్లిట్ గౌన్ లో కాళ్ళ అందాన్ని చూపిస్తూ స్టయిల్ గా నిలబడింది. బ్యాక్ గ్రౌండ్ లో కూడా బ్లాక్ కలర్ ఉండడంతో ఆమె మేని రంగు మిలమిలా మెరుస్తోంది. అందాలను పెద్దగా ఆరబోయలేదు గానీ స్టైల్ .. యాటిట్యూడ్ మాత్రం సూపర్.

ఈ ఫోటో షూట్ల అర్థం ఒక్కటే కదా… నన్ను చూడండి నా అందం చూడండి. పెళ్లైందని పక్కనబెట్టకుండా ఆవకాశాలు ఇవ్వండి! ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే ‘వీర భోగ వసంత రాయలు’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. నారా రోహిత్ – శ్రీ విష్ణు – సుధీర్ బాబు లు ఈ సినిమాలో ఇతర లీడ్ యాక్టర్స్.