టెన్షన్ లో దమ్మేస్తున్న శ్రియ

0ఈ రోజు హీరోయిన్ శ్రియ పుట్టిన రోజు. ఒకటిన్నర దశాబ్దం గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్ గా కంటిన్యూ కావడం అనేది సాధారణ విషయం మాత్రం కాదు. చాలా తక్కువమంది మాత్రం ఈ ఫీట్ సాధించగలరు. సరైన యాటిట్యూడ్ తో పాటు గ్లామర్ ను చెక్కుచెదరకుండా కాపాడుకోవడం దీనికి చాలా ముఖ్యం. ఇక శ్రియ ఈ రెండూ విషయాల్లో సక్సెస్ ఫుల్.

శ్రియ పుట్టినరోజు సందర్భంగా ‘వీరభోగ వసంతరాయలు’ టీమ్ ఒక స్నీక్ పీక్ వీడియో టీజర్ ను రిలీజ్ చేసింది. సూట్ లో ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ అవతారంలో ఉన్న శ్రియ ఏదో టెన్షన్ లో ఉన్నట్టుంది. సహజంగా హీరోలయితే ఆ సమయంలో ఒక సిగరెట్ కాలుస్తారు. సినిమా ముందు రెండు సార్లు.. ఇంటర్వెల్ ముందు రెండు సార్లు రాహుల్ ద్రావిడ్ సారు హెచ్చరించినా ముఖేష్ ను చూపించినా హీరోలు అసలు పట్టించుకోరు. ఇక శ్రియ కూడా అదే రూటు ఫాలో అయింది. ఒక సిగరెట్ వెలిగించి గుండెల నిండా పొగ పీల్చి అలా స్టైల్ గా వదిలింది. హీరోయిన్ లు పొగతాగడం తెలుగు సినిమాల్లో రేర్ గా జరుగుతూ ఉంటుంది.ఫన్నీ సీన్ లా కాకుండా.. ఏమాత్రం అగ్లీనెస్ లేకుండా క్యాజువల్ గా అలాంటి సీన్ చూపించడం మాత్రం తెలుగుతెరకు కొత్తే!

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నారా రోహిత్ – శ్రీ విష్ణు – సుధీర్ బాబు లు ఇతర కీలక పాత్రలలో కనిపిస్తారు. ఆర్. ఇంద్రసేన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మార్క్ రాబిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. బాబా క్రియేషన్స్ పతాకం పై బీ. అప్పారావు నిర్మిస్తున్నారు.