సీనియర్ హీరో సరసన శ్రియా శరణ్

0Shriya-Saran-picమిలీనియం సమయంలో టాలీవుడ్ అరంగేట్రం చేసిన బ్యూటీ శ్రియా శరణ్. టీనేజ్ లోనే ఫిలిం ఎంట్రీ ఇచ్చిన ఈమె వయసు.. ప్రస్తుతం 35 సంవత్సరాలు. దాదాపు 18 ఏళ్లుగా హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇంత సుదీర్ఘ కాలం హీరోయిన్ గా కొనసాగడం అనేది చాలా కష్టమైన విషయం. అయితే.. ఇప్పటికీ శ్రియ ఖాతాలో మంచి మంచి ఆఫర్స్ పడుతుండడం.. అది కూడా కీలకమైన పాత్రలు.. హీరోయిన్ రోల్స్ అవుతుండడం విశేషం.

ఈ ఏడాది ప్రారంభంలో బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో.. రాణి వశిష్టీ దేవిగా మెప్పించింది శ్రియా శరణ్. ప్రస్తుతం పూరీ జగన్నాధ్- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతోన్న పైసా వసూల్ చిత్రం లో కూడా హీరోయిన్ గా నటించేస్తోంది. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నక్షత్రం మూవీలో మాంచి హాట్ హాట్ ఐటెం సాంగ్ ఒకటి చేసేసిన శ్రియ ఖాతాలో ఇప్పుడో సూపర్బ్ ఆఫర్ వచ్చి చేరింది. సందీప్ కిషన్ హీరోగా రీసెంట్ గా నరకాసురుడు ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. తెలుగు-తమిళం రెండు భాషల్లో ఈ మూవీ రూపొందనుంది.

ఈ చిత్రంలో అరవింద్ స్వామి కీలక పాత్ర పోషిస్తుండగా.. ఈ సీనియర్ అందగాడికి జోడీగా నటించేందుకు శ్రియా శరణ్ ను ఫైనల్ చేయడం విశేషం. యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ ఈ నరకాసురుడు మూవీకి దర్శకత్వం వహించనున్నాడు.