ఎందుకిలా చక్కర్లు శ్రియా?

0టాలీవుడ్ బ్యూటీ శ్రియా శరణ్ చేతిలో ఇప్పుడు చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు లేవనే మాట ఒప్పుకోవాలి. అలాగని అమ్మడు ఖాళీగా ఏమీ ఉండదు. కొన్ని సార్లు వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది.. ఏ సినిమా ఈవెంట్ జరిగినా అమ్మడి డ్యాన్స్ పెర్ఫామెన్స్ కచ్చితంగా ఉంటుంది. పలు ఈవెంట్లు.. లాంఛింగ్ లలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది శ్రియ.

ఇప్పుడీ భామ బహుశా వరల్డ్ టూర్ లో ఉన్నట్లుంది. కానీ ఈ సీనియర్ బ్యూటీ స్పీడ్ చూస్తే షాక్ తినేసి మైండ్ బ్లాంక్ చేసుకోవాల్సిందే. కొన్ని రోజుల క్రితం స్పెయిన్ వెళ్లింది శ్రియ. అక్కడి నుంచి తన స్నేహితులతో కలిసి దిగిన బికినీ ఫోటోలను కూడా షేర్ చేసింది. అక్కడి నుంచి రెండో రోజుల్లో చెన్నై వచ్చి వాలిపోయింది. ఇక్కడ ఓ మొబైల్ ఫోన్ లాంఛింగ్ లో కనిపించిన ఈ భామ.. బోలెడన్ని అందాలను ఆరబోసింది. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ వెంటనే ఎంచక్కా తన ఫ్యామిలీతో కలిసి మళ్లీ ఫారిన్ చెక్కేసింది ఈ డ్యాన్సింగ్ బ్యూటీ.

పారిస్ ను విజిట్ చేసిన శ్రియా శరణ్.. అక్కడ కూడా కుదురుగా ఏమీ ఉండలేదు. ఇంతలోనే మళ్లీ న్యూయార్క్ లో వాలిపోయానంటూ అప్ డేట్ ఇచ్చింది శ్రియ. స్పెయిన్.. చెన్నై.. పారిస్.. న్యూయార్క్.. ఈ లైనప్ చూస్తే షాక్ తినాల్సిందే. ఎంతెంతో దూరాలను గంటల వ్యవధిలోనే దాటేస్తున్న శ్రియా శరణ్.. ఇంతకీ ఇంత జెట్ స్పీడ్ టూర్ ఎందుకు పెట్టుకుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.