టైం లేదు గురూ అంటున్న శ్రియ

0సౌత్ బ్యూటీ శ్రియా శరణ్ కు ఇప్పుడు డిమాండ్ బాగానే పెరిగింది. బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి భార్య వశిష్టీ దేవి పాత్రలో మెప్పించిన శ్రియకు.. తన ట్యాలెంట్ ఏ రేంజ్ లో కంటిన్యూ చేస్తోందో చెప్పకనే చెప్పింది. సెలెక్టివ్ గా సినిమాలు చేసే ఛాన్స్ ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీకి లేదు కానీ.. వచ్చే అవకాశాలు మాత్రం స్పెషల్ గానే ఉంటున్నాయి.

కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం మూవీలో ఐటెం గాళ్ గా కనిపించనుంది శ్రియ. ఇప్పటికే ఈ పాట చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. ‘టైం లేదు గురూ’ అంటే సాగే పాటలో చిట్టిపొట్టి బట్టలతో శ్రియ సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలు నెట్ లో బాగానే హల్ చల్ చేస్తున్నాయి. స్పెషల్ సాంగ్ అంటే మరీ స్పెషల్ గా ఉండేలా నైట్ ఎఫెక్ట్ తో కృష్ణ వంశీ తెరకెక్కించిన తీరు బాగానే ఆకట్టుకుంటోంది. టైం లేదు గురూ అంటూ రకరకాల రీజన్స్ తో ఎందుకు తొందర పడాలో చెప్పడంతో పాటు.. శ్రియ అభినయం మరింత ప్రత్యేకంగా ఉంది.

సహజంగా కృష్ణ వంశీ సినిమాల్లో ఐటెం సాంగ్ అంటూ స్పెషల్ గా ఏమీ ఉండదు. ఏదో ఒక పాటను స్పెషల్ గా తెరకెక్కించినా.. అది కథలో భాగంగానే ఉంటుంది. కానీ నక్షత్రం విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఓ ఐటెం సాంగ్ ను పిక్చరైజ్ చేసి మరీ మూవీలో భాగం చేస్తున్నాడీ దర్శకుడు.