శృతిహాసన్ సినిమా ఆగిపోయింది..!

0Shruthi-haasan-vidhyuth-jamalసౌత్ లో మంచి ఫాంలో ఉన్నా… బాలీవుడ్ లో సత్తా చాటేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది స్టార్ వారసురాలు శృతిహాసన్. కాటమరాయుడు సినిమాలో తన లుక్స్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ భామ తరువాత సౌత్ సినిమాలేవి అంగీకరించలేదు. చేతిలో ఉన్న సంఘమిత్ర నుంచి కూడా తప్పుకొని పూర్తిగా బాలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది.

అయితే ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన బెహన్ హోగీ తేరి సినిమాతో మరోసారి ఫెయిల్ అయిన శృతికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. శృతి హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘యారా’ ఆగిపోయింది. విధ్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్న ఈసినిమా చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ చిత్ర నిర్మాణం కొనసాగించలేమని భావించిన యూనిట్, నిర్మాణం ఆపేస్తున్నామని తెలిపారు.

తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శభాష్ నాయుడు సినిమా తప్ప మరే సినిమా కూడా శృతి హాసన్ చేతిలో లేదు. ఆ సినిమా కూడా ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ప్రస్తుతం శృతి బాయ్ ఫ్రెండ్ తో విదేశాల్లో చక్కర్లు కొడుతుందన్న ప్రచారం జరుగుతోంది.