ప్రేమపక్షుల ట్వీట్లు వైరల్

0కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్. డ్యాన్సు పాటలు నటన అన్నీ అదరగొట్టేస్తుంది. ఆమె మీద వచ్చే గాసిప్స్ కూడా తక్కువేమీ కాదు. గతంలో కొందరు హీరోలతో ఆమెకు రిలేషన్ షిప్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కొన్ని రోజులకు బ్రేకప్ అయినట్టు కూడా గాసిప్స్ వినిపించాయి. కొన్నేళ్లుగా మాత్రం శ్రుతి సీరియస్ రిలేషన్ షిప్లో ఉన్నట్టే కనిపిస్తోంది. లండన్ ప్రేమికులు మైకెల్ కోర్సలే మీద ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది.

ఎయిర్ పోర్టుల్లో శ్రుతి- మైకెల్ జంట ఎన్నో సార్లు మీడియా కంట పడింది. వారి ఫోటోలు కూడా వైరల్ అవ్వడం సర్వసాధారణమైపోయింది. గతంలో శ్రుతి ఒక రెస్టారెంట్లో మైకెల్ను తన తల్లికి కూడా పరిచయం చేసింది. శ్రుతి తల్లిదండ్రులు కూడా వారిద్దరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాక్స్ నడిచాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని లండన్లోనే సెటిల్ అవుతారని ఇలా ఎన్నో గాసిప్స్. తాజాగా వీరిద్దరూ పేర్లు ప్రస్తావించకుండా ఒకరికొకరు పెట్టుకున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. శ్రుతి క్లోజ్ ఫ్రెండ్ పెళ్లికి మైకెల్ కూడా వచ్చాడు. కొన్ని రోజులు ఇండియాలోనే ఉన్నాడు. తిరిగి వెళుతున్నప్పుడు ప్రేమ పక్షులిద్దరూ తెగా బాధపడ్డారు. ఆ బాధను ట్వీట్ల రూపంలోకి మార్చారు.

శ్రుతి తన ట్వీట్లో ఎవరైతే మనపక్కన ఉండాలని కోరుకుంటామో వాళ్లకి ఎయిర్ పోర్టులో గుడ్ బై చెప్పడం నిజంగా భరించలేని ఫీలింగ్ అని పెట్టగా… మైకెల్ ప్రతిసారి బాధపడుతూనే విడిచివెళుతున్నా అని బ్రోకెన్ హార్ట్ సింబల్ పెట్టాడు. వీరిద్దరి ట్వీట్లు ఒకరికోసం ఒకరని చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాదో వచ్చే ఏడాదో ఈ ప్రేమ పక్షులు పెళ్లి పీటలెక్కే అవకాశం ఉందని సమాచారం.