లండన్ లో శృతి హాసన్ వయ్యారాలు

0Shruti-Haasan-Enjoying-in-Londonకమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనదైన గుర్తింపునే తెచ్చుకుంది శృతి హాసన్. బాలీవుడ్ సినిమాల ద్వారా అటు నార్త్ లో.. మరో వైపు తెలుగు – తమిళ సినిమాల ద్వారా సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు – తమిళ్ లో ఒకేసారి వచ్చిన సింగం-3.. పవన్ కళ్యాణ్ తో చేసిన కాటమ రాయుడు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించకపోవడంతో ఈ ఏడాది అమ్మడి వ్యవహారం కాస్త డల్ గానే ఉంది.

మిగతా విషయాలెలో ఉన్నా కెమెరా ముందు హాట్ హాట్ ఫోజులివ్వడంలో శృతి ముందుంటుంది. రీసెంట్ గా లండన్ వెళ్లిన ఈ సుందరి తన టూర్ కు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రస్ లో ఓ బొమ్మ కారు నడుపుతున్నట్టుగా ఫోజులిచ్చింది. అందాలబొమ్మ అలా వయ్యారంగా నిలుచుని వాలు చూపుతో విష్ చేయడం చూస్తే యూత్ గుండెల్లో అలజడి రేగకుండా ఉంటుందా… అందుకే ఆమె స్టిల్ కు లైకుల మీదు లైకులొచ్చి పడుతున్నాయి.

శృతిహాసన్ లండన్ బేస్ డ్ యాక్టర్ మైఖేల్ కార్సేల్ తో డేటింగ్ చేస్తోందని… అప్పట్నించి సినిమాల మీద ఫోకస్ తగ్గిందని టాక్ ఉంది. ఆమధ్య ముంబయి ఎయిర్ పోర్ట్ లో వాళ్లిద్దరూ కలిసి వస్తూ కెమెరాక కళ్లకు చిక్కారు. విద్యుత్ జమాల్ తో కలిసి ప్రస్తుతం యారా సినిమా చేస్తోంది. అప్పటి నుంచి అతడితో సన్నిహితంగా ఉంటోందని ప్రచారం మొదలైంది. ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం అన్నదే శృతి ఆన్సర్.