అందుకే సినిమాలకు దూరంగా ఉందట!

0విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దులకూతురిగా తెరంగేట్రం చేసిన శృతీ హాసన్….ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో దూసుకుపోతూ…స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరింది. టాలీవుడ్ కోలీవుడ్ లలో సత్తా చాటి ….బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అయితే దాదాపుగా ఏడాది కాలంగా శృతీ ….సినిమాలకు దూరంగా ఉంటోంది. తెలుగులో కాటమరాయుడు తమిళంలో సింగం-3 హిందీలో బెహెన్ హోగీ తెరీ తర్వాత శృతి మరో సినిమాలో నటించలేదు. తమిళంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావించిన `సంఘమిత్ర`నుంచి శృతి తప్పుకోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే తన బాయ్ ఫ్రెండ్ మైఖెల్ ను శృతి పెళ్లి చేసుకోబోతోందని అందుకే సినిమాలకు గ్యాప్ వచ్చిందని పుకార్లు వచ్చాయి. దీంతో తాజాగా తాను సినిమాలకు దూరంగా ఎందుకు ఉంటున్నాననో శృతి క్లారిటీ ఇచ్చింది.

నటన మాత్రమే తనకు ముఖ్యం కాదని తన జీవితంలో ఇంకా చాలా విషయాలున్నాయని శృతి గతంలో చాలాసార్లు చెప్పింది. తాజాగా తన గ్యాప్ పై కూడా శృతి క్లారిటీ ఇచ్చింది. తన గురించి చాలా రూమర్స్ వస్తున్నాయని అవి అవాస్తవాలని చెప్పింది. తన గురించి తాను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత గ్యాప్ తీసుకున్నానని తెలిపింది. తన బలం బలహీనత తెలుసుకోవడానికే ఈ గ్యాప్ ఉపయోగపడిందన్నారు. తానేమిటో తనకు క్లియర్ గా అర్థం అయిందని ఇకపై సినిమాలతో బిజీ అవుతానని చెప్పింది. ప్రస్తుతం మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఒక హిందీ చిత్రంలో శృతి నటిస్తోంది. తన తండ్రితో కలిసి త్రిభాషా చిత్రం `శభాష్ నాయుడు`లో కూడా నటించనుంది.