కారులో.. ప్రియుడి కౌగిలిలో స్టార్ హీరోయిన్!

0shruti-haasan-boyfriendదక్షిణాది అందాల తార శృతిహాసన్ తన ప్రియుడు మైఖేల్ కోర్సేల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిందనే విషయం పలు సందర్భాల్లో మీడియా కంటపడిన సంగతి తెలిసిందే. గతంలో ముంబై ఎయిర్‌పోర్టులో ప్రియుడితో కలిసి మీడియా కంటపడటం సెన్సేషనల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల మైఖేల్‌తో కలిసి శృతిహాసన్‌ వెళ్లారని, అతడిని పెళ్లి చేసుకోవడం కోసమే సంఘమిత్ర చిత్రం నుంచి తప్పుకున్నదనే గాసిప్స్ విస్తృతంగా ప్రచారమయ్యాయి. ప్రస్తుతం తన ప్రియుడికి దూరంగా ఉండలేనటువంటి పరిస్థితిలో శృతిహాసన్ ఉన్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అందుకు సాక్ష్యంగా ఈ ఫొటో నిలిచింది.

ఇటీవల ప్రియుడు మైఖేల్ కోర్సలేతో వ్యవహరించిన తీరు మరోసారి మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇటీవల ఎయిర్‌పోర్టులో వారిద్దరూ కలుసుకొన్నారు. లండన్ నుంచి వచ్చిన మైఖేల్‌ను చూసి ఆనందంతో పరవశించిపోయింది. ఆ అందమైన కౌగిలిని పలువురు ఫోటోగ్రాఫర్లు చటుక్కున పట్టేశారు.

ఎయిర్‌పోర్టులోనే అందరూ చూస్తుండగానే వాహనంలోకి దూకింది. వెంటనే కౌగిలిలో బంధించింది. మైఖేల్ ఒడిలో ఒదిగి తన్మయత్వంతో ఊగిపోయింది. మీడియా కెమెరాల్లో తమను బంధిస్తున్నాయన్న విషయాన్ని పట్టించుకోకుండా శృతిహాసన్ కౌగిలిలోనే ఉండిపోవడం ఆమె ప్రేమకు సంకేతంగా మారింది.

మైఖేల్‌తో వ్యవహారం మరోసారి బహిరంగమైంది. ఇక వారి మధ్య ఉన్నది ప్రత్యేకమైన రిలేషన్ అబద్ధం ఆడటానికి వీలులేకుండా తాజా ఫొటోలు బలాన్ని ఇస్తున్నాయి. వారి మధ్య క్రెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తున్నది.

గతంలో మైఖేల్‌తో అఫైర్‌ను బహిరంగ పరచడానికి ఆసక్తి చూపలేదు. కానీ ప్రస్తుతం ఎవరు ఏమనుకున్నా పట్టించుకొను అనే పరిస్థితి కనిపిస్తున్నది. నా గురించి ఎవరు ఏమనుకొన్నా పట్టించుకోను. నా గురించి ఏమీ రాసిన నాకు ఇబ్బంది లేదు. నా వ్యక్తిగత జీవితాన్ని నేను స్లయిల్‌లో ఆస్వాదిస్తాను అని శృతిహాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నది.

లండన్‌లో మైఖేల్ కోర్సెలే థియేటర్ ఆర్టిస్టు. ఇటీవల బ్రిటీష్ రాక్ బ్యాండ్ డనోసార్ పైల్ అప్ కోసం ఓ పాట రికార్డింగ్‌కు శృతి లండన్‌లో పర్యటించింది. ఆ సందర్భంగా ఓ కామన్ ఫ్రెండ్‌ ద్వారా శృతితో మైఖేల్‌కు పరిచయం జరిగింది. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు అని శృతి సన్నిహితులు తెలిపారు.

తాజాగా కాటమరాయుడు చిత్రంలో కనిపించిన శృతిహాసన్ ప్రస్తుతం తండ్రి కమల్ హాసన్ రూపొందిస్తున్న శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్నది. తమిళంలో అతిపెద్ద ప్రాజెక్ట్ సంఘమిత్ర నుంచి తప్పుకోవడం తమిళ చిత్ర పరిశ్రమలో ఓ వివాదంగా మారింది. ఈ అంశంపై శృతిహాసన్‌పై ఇటీవల సీనియర్ నటి ఖుష్భూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.