శృతి ఎదో ఫిలాసఫీ చెబుతుందేంటి?

0అడుగుపెట్టగానే డిజాస్టర్స్ అందుకున్న హీరోయిన్స్ చాలా వరకు మొదట్లోనే మాయమవుతారు. ఒక్క డిజాస్టర్ పడింది అంటే చాలు. మళ్ళీ కనిపించరు. చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటేనే దర్శక నిర్మాతలు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వారి అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే రెమ్యునరేషన్ తగ్గించి సినిమా కథకు తగ్గట్టు ఫ్లాప్ హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకుంటారు. అదే తరహాలో గతంలో శ్రుతి హసన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.

పేరుకు కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ అమ్మడు మొదట్లో చాలా విమర్శలు ఎదుర్కొంది. బాలీవుడ్ లో మొదటి ఎంట్రీతోనే బికినిలో దర్శనమిచ్చి అందరిని షాక్ కి గురి చేసింది. ఇక అక్కడ ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో సౌత్ లో అడుగులు వేసి మొదట్లోనే ఐరెన్ లెగ్ అని ఓ టాక్ తెచ్చుకుంది. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ శృతి తలరాతని మార్చేసింది. తెలుగు సినిమాల వల్ల కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో జతకట్టేందుకు అవకాశం దొరికింది.

అయితే ఈ లోకనాయకుడి కూతురు ఇప్పుడు తెలుగు సినిమాలకు ఒకే చేయడం లేదు. ఇక సోషల్ మీడియాలో రోజు ఎదో ఒక ఫిలాసఫీతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మీరు ఉదయాన్నే ఏది ఫీల్ అవుతారో అది చేయడం సాధ్యమే! ప్రణాళికలతో వెళితే ప్రతి పనిలో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నేను ప్రతి కళను నేర్చుకుంటూ ప్రతి సంవత్సరం ఎంతో సరదాగా గడుపుతున్నాను అంటూ.. శృతి ట్వీట్ చేసింది.