మైఖేల్ వల్లే సినిమాలు వదులుకుందా?

0

ఒక హీరోయిన్ ఎక్కువ కాలం కొనసాగాలంటే గ్లామర్.. నటన.. అదృష్టం ఉంటే సరిపోదు. ఇవన్నీ ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్ కూడా అనుకూలంగా ఉండాలి. ఒక్కోసారి ఎవరైనా అందమైన అబ్బాయి లవ్వులో పడితే.. ఆ అందమైన భావుకత్వంలో కూడిన మాయలో పడి సినిమాలు మిథ్య.. ప్రేమికుడే సత్యం.. అదే నిత్యం అనిపించే ప్రమాదం ఉంది. అప్పుడు సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. మరి శృతి హాసన్ కు ఇదే జరిగిందో లేదో తెలీదు కానీ అదే జరిగిందని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదెలాగంటారా? లండన్ బేస్డ్ యాక్టర్.. ఇటలీ మూలాలున్న మైఖేల్ కోర్సలేతో శృతి ప్రేమలో పడిందనేది ఓపెన్ సీక్రెట్. తన సినిమాలను మెల్లగా తగ్గించుకొని లండన్ కు మకాం మార్చిందన్నది కూడా అందరికీ తెలిసిందే. అక్కడ ఇంటర్నేషనల్ సింగర్ కావాలని ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. మరోవైపు మైఖేల్ తో రెండేళ్ళ సహవాసం తర్వాత ఇద్దరూ దూరమయ్యారని వార్తలు వస్తున్నాయి. మైఖేల్ కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అర్థం అయ్యి అర్థం కాకుండా అర్థం అవుతూ ఉండేలా ఆర్జీవీ స్టైల్ లో విడిపోవడం గురించి హింట్ ఇచ్చాడు. ఇక మైఖేల్ అలా ఉంటే శృతి ఇండియా కు తిరిగి వచ్చి ఎడాపెడా సినిమాలు సైన్ చేయడం మొదలు పెట్టింది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే మైఖేల్ తో ప్రేమలో పడిన సమయంలో సినిమాలను వద్దనుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే సుందర్ సి. భారీ ప్రాజెక్ట్ ‘సంఘమిత్ర’ నుండి తప్పుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఆమె ఆఫర్లు ఏవీ యాక్సెప్ట్ చేయలేదు. ఇక మైఖేల్ కు దూరం అయిన వెంటనే ఒక్క నిముషం కూడా ఆలస్యం చేయకుండా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో మొదటి సినిమాగా విజయ్ సేతుపతి ‘లాబం’ లో నటిస్తోంది. ఇదే సిట్యుయేషన్ ఉంటే మరో హీరోయిన్ కు అవకాశాలు వస్తాయో లేదో తెలీదు కానీ శృతికి మాత్రం ఆఫర్లు ఉన్నాయి. లక్కీనే!
Please Read Disclaimer