మేకప్ లేని శృతి వేదాంతం

0

హీరోయిన్స్ అంటేనే గ్లామర్.. మరి గ్లామరస్ గా ఉండాలంటే మేకప్ అవసరమే కదా. మేకప్ వేసుకుని డిజైనర్ డ్రెస్సులు వేసుకొని తీసుకున్న ఫొటోలకు కూడా ఎన్నో ‘టచప్’ లు ఇచ్చి ఫిల్టర్ లు వేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. ఆఖరికి స్విమ్మింగ్ పూల్ లో బికినీల్లో జలకాలాడే సమయంలో కూడా లిప్ స్టిక్ వదలరు. కానీ శృతి హాసన్ మాత్రం నో మేకప్.. నో ఫిల్టర్స్ అంటూ ఒక ఫోటో పోస్ట్ చేసి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేసి పెద్ద మెసేజ్ పెట్టింది. “నేను ఈ ఫోటోను పోస్ట్ చేసేందుకు డిసైడ్ అయ్యాను – నో మేకప్ నో ఫిల్టర్ పిక్చర్ ఎందుకంటే నేను ఈ రోజొక లవ్లీ డే. నా ఫ్రెండ్స్ తో సరదాగా గడిపాను.. జిమ్ లో వర్కౌట్ చేశాను.. మనసు కూడా సంతోషంగా ఉంది. పర్ఫెక్షన్ అనేది ఒక మిథ్య.. నమ్మకం లేకపోవడం.. అనుమానాలనేవి తప్పవు గానీ వాటిని నువ్వు వదిలించుకోవాలంటే నువ్వు అనుకున్న దారిలో నువ్వు ప్రయాణం చెయ్యి… మిగతా అంతా అదే జరుగుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ గురించి మూడు మంచి సంగతులు పెద్దగా చెప్పండి.. లేదా మీకే మీరు ఒక లెటర్ రాసుకోండి. పక్కనోళ్ళకు మీ సత్తా ఎంతో నిర్ణయించే అధికారం ఎప్పటికీ ఇవ్వకండి.. ఎప్పుడూ మీదైన ప్రత్యేకమైన దారిలోనే భారీగా కలలు కనండి.”

శృతి ఫిలాసఫీ అర్థం అయింది కదా? అర్థం కాకపోతే మరో సారి చదవండి. అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఇటాలియన్ బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే చెప్పి ఉంటాడేమో అని సరిపెట్టుకోండి. అన్నట్టు ఈ శృతి – మైఖేల్ ఇద్దరూ వచ్చే ఏడాది ఒక్కటవుతారట. ఇక ప్రొఫెషనల్ విషయాలు మాట్లాడుకుంటే.. రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది. అవి కాకుండా సింగర్ గా మ్యూజిక్ ప్రొడ్యూసర్ న్యూక్లియా తో కొలాబరేట్ అయింది. వీరి ఆల్బమ్ నవంబర్ లో రిలీజ్ అవుతుందట.
Please Read Disclaimer