ఐటెంలో చించేసిన శ్రుతి హాసన్

0

Shruti-hassan-item-song

ఈ మధ్య టాప్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగుల్లో చిందేస్తున్న విషయం తెలిసిందే. కరీనా కపూర్, కత్రినా కైఫ్ , ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు ఐటెం పాటల్లో చిందేసి అలరించిన విషయం తెలిసిందే. టైటిల్ ని చూసి శ్రుతి హాసన్ కూడా ఐటెం బాట పట్టిందని మీరనుకుంటే కాస్త పొరబడ్డట్లే. ఇక్కడ విషయం ఏంటంటే ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో బిజీగా ఉన్న శ్రుతికి నటన తో పాటు పాడే అలవాటు కూడా ఉంది. గతంలో ఈమె ఓ ఆల్చమ్ ని కూడా రిలీజ్ చేసి, మంచి గాయనిగా పేరు తెచ్చుకుంది. అలాంటి క్రమంలో తాజాగా ఓ తమిళ సినిమాకు ఓ ఐటెం నంబర్ పాడినట్టు సమాచారం. తెలుగులో హిట్టయిన ‘అలా మొదలైంది ’ చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం శృతి హాసన్ ఓ పాట పాడిందట. ఈ పాట సినిమాకే హైలెట్ అవుతుందని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో శ్రుతి ఐటెం సాంగ్స్ లో నర్తించిన ఆశ్చర్య పోనక్కరేదేమో ?

ఐటెంలో చించేసిన శ్రుతి హాసన్, shruti hassan news,  indian celeb shruti hassan news,  shruti hassan latest news,