`రేసుగుర్రం` అందాలు మ‌రీ `శ్రుతి`మించాయ‌ట‌

0Sruthi Hasan race gurramక‌మ‌ల్‌హాస‌న్ త‌న‌య శ్రుతి హాస‌న్ ఇటీవ‌ల రెచ్చిపోతోంది. త‌న లేలేత అందాల‌ను తెర నిండా ఆర‌బోసి కుర్రకారు మ‌తి చెడ‌గొడుతోంది. `బ‌లుపు` చిత్రంలో ప‌డిపోయా ప‌డిపోయా… అంటూ త‌న అందాల క‌నువిందు చేసింది. ఇప్పుడు మ‌రోసారి విజృంభించింద‌ట‌. ఈసారి సెక్స్‌బాంబ్ అనే ముద్ర ప‌డినా ఆశ్చర్యపోన‌వ‌స‌రం లేద‌నీ, శ్రుతి అంత‌గా అందాలు ఆర‌బోసింద‌ని అంటున్నారు.

ప్రస్తుతం స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టిస్తోంది శ్రుతిహాస‌న్‌. వీళ్లిద్దరి క‌ల‌యిక‌లో `రేసుగుర్రం` అనే చిత్రం తెర‌కెక్కుతోంది. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా పేరునుబ‌ట్టి ఇందులో అల్లు అర్జున్ రేసుగుర్రంలా క‌నిపిస్తాడేమో అనుకొంటాం. కానీ శ్రుతిహాస‌నే ఓ రేసుగుర్రంలా క‌నిపిస్తుంద‌ట‌. ఏ మాత్రం ఒళ్లు దాచుకోకుండా హుషారుగా న‌టించింద‌ట‌. ఇటీవ‌లే వీరిద్దరిపై విదేశాల్లో కొన్ని స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు. వాటిలో శ్రుతి చాలా చాలా అందంగా క‌నిపించింద‌ట‌.

శ్రుతి తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో కూడా న‌టిస్తోంది. అక్కడి చిత్రాల్లో స‌హ‌జంగానే గ్రామ‌ర్‌పాళ్లు కొంచెం ఎక్కువ‌గా ఉంటాయి. అక్కడ న‌టించ‌డం అల‌వాటు చేసుకొన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా అదే త‌ర‌హాలో న‌టించాల‌ని చూస్తోంద‌ట‌. ద‌ర్శకులు ఏం అడిగితే అది చేసేస్తుంద‌ట‌. శ్రుతి ఉదార‌స్వభావం చూసి ద‌ర్శకులు తెగ మెచ్చుకొంటున్నార‌ట‌.