త్రాచు పాముతో ఫోటో, శృతి అరెస్ట్

0Shruti-Ulfat-selfie-with-saపాపం బాలీవుడ్ టివి సీరియల్స్ బాగా పాపులర్ అయిన శృతి ఉల్ఫట్ ఇలా జరుగుతోందని అస్సలు ఊహించలేదు. అయితే ఈ అమ్మడు మాత్రం.. ఓ నాలుగు నెలల క్రితం అంతరించిపోతున్న జాతికి చెందిన ఒక త్రాచు పాములతో గడిచిన అక్టోబర్ లో ”నాగార్జున.. ఏక్ యోధా” అనే టివి సీరియల్ లో మెయిన్ లీడ్ హీరోయిన్ గా నటించిన శృతి ఉల్ఫట్.. ఆ టివి సిరీస్ 100 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రమోట్ చేయడానికి.. అంతరించిపోతున్న త్రాచు పాము జాతికి చెందిన ఒక విష సర్పంతో ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ.. శృతి ఒక ఫోటో దిగింది. సదరు వీడియోను ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేసింది. దానితో ఆగ్రహానికి గురైన పర్యావరణ మరియు జంతు ప్రేమికులు థానే ఫారెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు. అయితే ఈ ఫోటోలో కనిపించిన పాము ఒరిజినల్ కాదని.. అది గ్రాఫిక్స్ లో చేశాం అంటూ శృతి చెప్పగా.. కళింగా ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఇదే విషయంపై నిపుణులు సదరు ఫోటోపై రిసెర్చ్ చేసి.. ఆమె ఒరిజినల్ పాముతోనే ఫోజులిచ్చిందని తేల్చారు.

దానితో ఈరోజు ఆమెను అరెస్టు చేసి.. ఒక్క రోజు లోపల కోర్టులో హాజరు పరచాలి కాబట్టి.. కోర్టులో హాజరు పరచి విడుదల చేశారు. ఇకపోతే శృతి మాత్రం.. తనకు ఆ పాము ఒరిజినలో అంతరించిపోతున్న త్రాచుపామో తెలియదని.. కాబట్టి తను కేవలం అమాయకురాలినని.. నటి కాబట్టి తన పేరును పదే పదే రాస్తూ మీడియా రాద్దాంతం చేస్తోందంటూ శృతి ఆరోపించింది.