అతడితో శ్వేతా బసు డేటింగ్ లో ఉందట!

0Shweta-Basu-Is-Datingఏక్తాకపూర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న చంద్రనందిని సీరియల్ లో కీ రోల్ ప్లే చేస్తున్న బెంగాలీ బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్ గురించి తెలుగువారికి ఏమాత్రం పరిచయ అవసరం లేదు. ఎ..క్క..డా అంటూ కొత్తబంగారు లోకం సినిమతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్వేతాబసు తర్వాతి కాలంలో అనుకోని సమస్యల్లో చిక్కుకుని తెలుగుకు దూరమయ్యింది. అనంతరం కాస్త అలజడి సద్దుమణగడం ఆమెకూడా కాస్త షాక్ నుంచి తేరుకోవడం జరిగిన తర్వాత ముంబై వెళ్లిపోయింది. ఈ సమయంలోనే ఒక ఫిల్మ్ మేకర్ తో పరిచయం అవ్వడం ఇప్పుడు అతడితోనే డేటింగ్ లో ఉందటం జరిగిపోయింది.

శ్వేతాబసు ప్రసాద్ ముంబై వెళ్లాక ప్రముఖ హిందీ దర్శక – నిర్మాత అనురాగ్ కశ్యప్ నిర్మాణ సంస్థ లో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ తో ఈమెకు పరిచయమైందని ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని అప్పుడు వార్తలు గుప్పుమన్నాయి. కానీ.. ఆ సమయంలో ఇద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు. అయితే కొంతకాలానికి ఇవి గాసిప్సేనేమో అని భావిస్తున్న తరుణంలో మౌనం వీడి పెదవి విప్పిన ఈ బ్యూటీ “అవును.. డేటింగ్ వార్త నిజమే.. రెండేళ్ల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నాం.. వియ్ ఆర్ హ్యాపీ.. అయితే పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదు.. కానీ ఒడిదుడుకులేమీ లేకుండాగా మా పెళ్లి జరుగుతుందనే నమ్మకం నాకుంది” అని చెప్పుకొచ్చింది.

కాగా… మక్దీ ఇక్బాల్ వంటి సినిమాల ద్వారా హిందీలో బాల నటిగా కెరీర్ ప్రారంభించి జాతీయ అవార్డులు అందుకుని అనంతరం టాలీవుడ్ లో మెరుపులు మెరిపించిన శ్వేతాబసు ప్రసాద్ 2014లో ఒక కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఆ ప్రస్థావన తీసుకొచ్చిన వారి వద్ద… “ఆ సానుభూతి నాకు అవసరం లేదు దయ చేసిన నాపై ఎవరూ సానుభూతి చూపించొద్దు” అని తెలిపడం తెలిసిందే!!

loading...