అలాంటి పనులు చేయను: శ్వేతబసు

0Shweta-basu-prasadసినీనటిగా మంచి గుర్తింపు. అంతలోనే వ్యభిచార ఆరోపణలపై అరెస్ట్. ఆ తర్వాత రెస్క్కూ హోం తరలింపు. అత్యంత భయంకరమైన సంఘటనల తర్వాత సినీనటి శ్వేతబసు ప్రసాద్ జీవితం ఇప్పడిప్పుడే గాడిన పడుతున్నది. టీవీ షోలు, సినిమాలు, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతూ బిజీగా మారింది. ఇటీవల చంద్ర నందినీ నిర్వహించే షోలో దర్శనమిచ్చింది. బిజీగా సాగే షూటింగ్‌లు, అనేక రకాల వ్యాపకాలు నా జీవితానికి సవాల్‌గా నిలువలేదు అని శ్వేతబసు వెల్లడించింది. ఆ షోలో తన వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది.

నటన, పెయింటింగ్, డాక్యుమెంటరీ నిర్మాణాలు, ఇతర పనులన్ని నాకు కష్టం కాదు. ఇష్టమైన పనులు చేసినప్పుడు శ్రమ తెలియదు. నా సమయాన్ని నేను చక్కగా ప్లాన్ చేసుకొంటాను. ప్రతీ రోజు సుమారు 18 గంటలు పనిచేస్తాను. జీవితంలో ప్రతీ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తాను అని చెప్పారు.

షూటింగ్‌లో ఉన్నప్పుడు సినిమాకే అంకితమవుతాను. ఇతరులు మాదిరిగా షాట్‌కు షాట్‌కు మధ్య నేను సమయాన్ని వృథా చేయను. గాసిప్స్, రూమర్ల గురించి మాట్లాడటం ఇష్టం ఉండదు. షూటింగ్‌లో సెల్ఫీలు దిగడం.. వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి టైంవేస్ట్ చేయను. ఏదో ఉపయోగం ఉండే పనిపై దృష్టిపెడుతాను. పుస్తక పఠనం, లేదా నా ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తాను అని శ్వేతబసు చెప్పారు.

చాలాసార్లు షూటింగ్‌లో నా సహచర నటులు ఏదో పిచ్చపాటి వాగుతుంటారు. అలాంటి వారితో ఉన్నప్పుడు కూడా జీవితానికి పనికి వచ్చే విషయాలను చర్చిస్తాను. అప్పుడే విలువైన కాలం సద్వినియోగం అవుతుంది అని శ్వేతబసు తెలిపింది.

ప్రస్తుతం దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి పనిచేస్తున్నాను. ఆయనకు నేను స్క్రిప్ట్‌ కన్సల్టంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఆయన నుంచి చాలా నేర్చుకొంటున్నాను. ప్రొడక్షన్ హౌస్ కోసం స్రిప్టులు చదువడం, వాటిని సమీక్షించడం చేస్తున్నాను. కశ్యప్‌తో పనిచేయడం అద్భుతంగా ఉంది అని శ్వేతబసు చెప్పారు.

శ్వేతబసు 2002లో మక్డీ చిత్రంతో బాలతారగా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత కొత్త బంగారు లోకం చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత డర్నా జరూరీ హై చిత్రంలో నటించింది. వ్యభిచార ఆరోపణల కేసు నుంచి బయటపడిన తర్వాత తాజాగా వరుణ్ ధావన్‌తో కలిసి బద్రీనాథ్ కి దుల్హనియా చిత్రంలో కనిపించింది.