షాకింగ్‌గా ఉంది: శ్యామ్‌ కే నాయుడు

0shyam-k-naidu-tanishడ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుంచి తనకెలాంటి నోటీసులు రాలేదని కెమెరామెన్‌ శ్యామ్‌ కే నాయుడు తెలిపారు. తనకు నోటీసులు వచ్చినట్టు వార్తలు రావడంతో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మీడియాలో వార్తలు చూస్తే షాకింగ్‌గా ఉందని పేర్కొన్నారు. తానేప్పుడు బయట కూడా ఎక్కువగా కనిపించనని, వార్తల్లో తన పేరు రావడం బాధగా ఉందన్నారు. ఇలాంటి ప్రచారంతో తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్‌ వ్యవహారంతో తనకు సంబంధం లేదని వర్ధమాన హీరో తనీష్‌ తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. తమకు నోటీసులు అందాయని నవదీప్‌, సుబ్బరాజు తెలిపారు. డగ్స్ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని వారు చెప్పారు. ఎందుకు నోటీసులు పంపించారో అర్థం కావడంలేదని సుబ్బరాజు అన్నారు.