హెల్మెట్ ఇచ్చిన కవిత, చేనేత చీర పెట్టిన అన్న

0ktr-raksha-bandhan-tweetతెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఆయన సోదరి, ఎంపి కల్వకుంట్ల కవిత సోమవారం రాఖీ కట్టారు. రాఖీ కట్టడంతో పాటు సోదరుడికి హెల్మెట్ బహూకరించారు. ప్రతిగా కేటీఆర్ సోదరికి చేనేత చీరను ఇచ్చారు.

అన్నాచెల్లెల్ల అనుబంధాన్ని అద్భుతంగా చూపించిన ఒక వీడియోను షేర్ చేస్తూ రాఖీ పండ‌గ జ‌రుపుకుంటున్న తోబుట్టువులంద‌రికీ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో రాఖీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

అన్నాచెల్లెల అనుబంధం గురించి ఇంత‌కంటే ఆక‌ర్ష‌ణీయంగా వ‌ర్ణించ‌లేమని, నా ప్రియ‌మైన చెల్లెలు క‌విత‌కు ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు అని, అలాగే ఈరోజు పండగ జ‌రుపుకుంటున్న తోబుట్టువులంద‌రికీ.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేటీఆర్ షేర్ చేసిన వీడియోలో.. ఓ చిన్నారి పాఠశాల నుంచి వచ్చే తన అన్న కోసం రోడ్డుపై ఎదురు చూస్తుంటుంది. అన్న స్కూల్‌ బస్సు వచ్చి ఆగగానే పరిగెత్తుకుంటూ వెళ్లి తన అన్నను హత్తుకుంటుంది.

రక్షా బంధన్‌ను పురస్కరించుకొని అక్కా చెల్లెళ్లు సోదరులకు రాఖీలు కడుతూ ఈరోజు ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్నారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు.