అక్షయ్ కు జలక్ ఇచ్చిన సిద్ధార్థ్

0

బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడైతే తన సినిమా జీవితాన్ని వదిలి రాజకీయంగా అంటకాగి ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశాడో అప్పటి నుంచి ఆయనపై దాడి మొదలైంది. అది చిలికిచిలికి గాలివానగా మారి అక్షయ్ కుమార్ ఇండియనే కానంత తీవ్రంగా పరిస్థితి మారింది.

ఇప్పుడు అక్షయ్ కుమార్ పై సౌత్ హీరో సిద్ధార్థ్ కూడా సెటైర్లు వేశారు. ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ పేరు ప్రస్తావించకుండానే ఆయనను కడిగిపారేశాడు.. ‘హే డొనాల్డ్ ట్రంప్.. మీకు ఒక సలహా.. ఈ సారి ఎన్నికలు ఎదుర్కొనే ముందు నాకో ఇంటర్వ్యూ ఇవ్వండి.. మిమ్మల్ని మంచి ప్రశ్నలు అడుగుతాను.. మీరు నిద్ర ఎలా పోతారు.? ఎలాంటి పళ్లు తింటారు.. మీ అందమైన శరీరం ఇలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతాను’ అంటూ అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూపై సెటైర్లు వేశారు.

ఇక హీరో సిద్ధార్థ్ అంతటితో ఆగిపోలేదు. అక్షయ్ కుమార్ పౌరసత్వం గురించి సెటైర్ వేశారు. డొనాల్డ్ ట్రంప్ గారూ.. నాకు ఇండియన్ పాస్ పోర్ట్ ఉంది. అయినా పర్లేదు కదా అని సిద్ధార్త్ కౌంటర్ ఇచ్చాడు.

అక్షయ్ కుమార్ తాజాగా మోడీని ఇంటర్వ్యూను చేశాడు. ఓటు గురించి.. ప్రజాస్వామ్యం గురించి లెక్చర్ దంచాడు. కానీ ఆయన భార్య ఓటేసి.. ఈయన ఓటు వేయలేదు. అప్పుడే అక్షయ్ కుమార్ కు భారతీయ పౌరసత్వం లేదని.. కెనడా పౌరసత్వం ఉందని అర్థమైంది. దీంతో నెటిజన్లు ఇండియాలో ఉంటూ కెనడా పౌరసత్వమా అని దుమ్మెత్తిపోస్తున్నారు. అక్షయ్ దేశభక్తి విషయంలో రెండు కళ్ల సిద్ధాంతం ఉపయోగిస్తున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సిద్ధార్థ్ కూడా అలానే సెటైర్లు వేశారు.
Please Read Disclaimer