సిద్ధార్థ్ స్వయంకృతం

0

టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ లో ఉవ్వెత్తున ఎగసిపడిన తరంగం – సిద్ధార్థ్. నువ్వొస్తానంటే నేనొద్దంటానా – బొమ్మరిల్లు చిత్రాలతో తెలుగు ఆడియెన్లో గొప్ప ఫాలోయింగ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ .. ఆ తర్వాత కొన్ని తప్పులు చేసి కెరీర్ పరంగా చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడు కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి అతడి స్వయంకృతమే కారణమని చెబుతారు. ఓవైపు కథానాయికలతో ఎఫైర్లు అతడిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయన్న విశ్లేషణ తమిళ క్రిటిక్స్ చేస్తారు.

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. కెరీర్ జర్నీలో అతడు ఐదుగురు హీరోయిన్లతో ఎఫైర్లు సాగించాడు. 2003లో మేఘన అనే చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన సిద్ధార్థ్ 2007లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో `రంగ్ దే బసంతి` టైమ్ లో స్టార్ హీరో సైఫ్ ఖాన్ సోదరి సోహా అలీఖాన్ తో ఎఫైర్ సాగించి బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత సౌత్ నాయికలు శ్రుతిహాసన్ – సమంత – దీపా సన్నిధిలతో ప్రేమలో పడ్డాడు. ఇవన్నీ అతడికి కెరీర్ పరంగా డిస్ట్రబెన్సెస్ గానే మారాయని ప్రఖ్యాత తమిళ జర్నలిస్ట్ (చెన్నై) జనని అయ్యర్ ఓ కథనంలో పేర్కొనడం అప్పట్లో సంచలనమైంది.

అదంతా గతం అనుకుంటే వర్తమానంలో సిద్ధార్థ్ కోలీవుడ్ తో పాటు – మాలీవుడ్ లోనూ కెరీర్ కోసం పాకులాడుతున్నాడు. టాలీవుడ్ కెరీర్ మాత్రం పూర్తిగా జీరో అయిపోయింది. `గృహం` అనే హారర్ డబ్బింగ్ సినిమా అప్పట్లో ప్రశంసలు అందుకున్నా – ఆ తర్వాత సిద్ధార్థ్ వేరొక తెలుగు సినిమాలో నటించిందే లేదు. ప్రస్తుతం అతడు నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ `లీలా`లో నటించనున్నాడు. సిద్ధార్థ్ కి ఇదే తొలి వెబ్ సిరీస్. `మిడ్ నైట్ చిల్ట్రన్` దర్శకురాలు దీపా మెహతా ఈ సిరీస్ కి దర్శకత్వం వహించనున్నారు. హ్యూమా ఖురేషి కథానాయికగా నటించనుంది. భారతదేశం నేపథ్యంలోని కథాంశంతోనే ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.
Please Read Disclaimer