సిద్ధార్ధ్ తో లండన్ కు రకుల్

0Rakul-Preet-and-Sidharth-Maటాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న స్పైడర్ చిత్రంలో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో తనకు మరో బంపర్ హిట్ గ్యారెంటీ అని ఈ ఢిల్లీ భామ నమ్మకంగా ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్పైడర్ ఒకేసారి తెరకెక్కుతుండటంతో ఈ ఏడాది అక్కడా తన పేరు మార్మోగిపోతుందనే ఆశతో ఉంది. ఇదే సమయంలో తన మాతృభాషయిన హిందీలోనూ గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్ 2014లోనే యారియా సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. కాకుంటే పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఆమె సిద్ధార్ధ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న అయ్యారీ పైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. ఇందుకోసం రకుల్ లండన్ బయలుదేరి వెళ్లింది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన చిత్రాలను హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు. ఇదే సమయంలో తమిళంలో తాను నటిస్తున్న తీరన్ అధిగారం ఒండ్రు సినిమా షూటింగ్ పూర్తయిందని… అయ్యారీ కోసం లండన్ కు బయలుదేరి వెళ్తున్నానంటూ రకుల్ ట్విట్టర్ సమాచారం షేర్ చేసింది.

బాలీవుడ్ లో క్రైమ్ చిత్రాలను ఢిపరెంట్ గా తెరకెక్కించడంలో పేరు తెచ్చుకున్న నీరజ్ పాండే అయ్యారీ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందుతున్న ఈ ఫిలింలో మనోజ్ బాజ్ పేయి కీలకమైన పాత్ర చేస్తున్నాడు. ఒకేసారి నార్త్ సౌత్ లోనూ హిట్లు కొట్టేయాలని తెగ ఆరాట పడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆశ ఈ ఏడాది నెరవేరుతుందేమో వేచి చూడాలి మరి.