సన్ని లియోన్…మరో వివాదం

0సన్ని లియోన్.. అందాల తారే కాదు… వివాదాల పుట్ట కూడా. ఆమె జీవితంలో తొలి నుంచి అన్నీ వివాదాలు. తాజాగా సన్నిలియోన్ వ్యక్తిగత జీవితంపై రానున్న బయోపిక్ కూడా విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోంది. ఇంతకీ ఇది ఎలాంటి వివాదం అనుకుంటున్నారా..? ఏం లేదు… సన్ని లియోన్ పేరు ప్రఖ్యాతలు రాక ముందు ఆమె పేరే ఇప్పుడు వివాదం అవుతోంది.సన్నీలియోన్ అసలు పేరు కరణ్ జిత్ కౌర్. ప్రస్తుతం క్రిస్టియన్ అయిన సన్ని లియోన్ నిజానికి పుట్టింది సిక్కు మతంలో. అందుకే ఆమె పేరు కరణ్ జిత్ కౌర్ అని పెట్టారు. పెద్దయ్యాక….. క్రీస్టియానిటీలోకి మారిన సన్నీ తన పాత పేరు మార్చుకుని సన్నీ లియోన్ గా మారింది. ఆ పేరుతోనే పోర్న్ స్టార్ గా – సినీ హీరోయిన్ గా ఎదిగింది. ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ స్టార్ పై ఓ బయోపిక్ తీస్తున్నారు. ఈ కరణ్ జిత్ కౌర్ చిత్రం ట్రైలర్ ఈ నెల 5న సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్ – యూట్యూబ్ – ఫేస్ బుక్ లలో వచ్చింది. అంతే వివాదం ముదరడం ప్రారంభమైంది.

సినిమా పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ విడుదలను అడ్డుకోవాలని నిర్ణయించింది. సామాజిక మాధ్యమాల్లో కూడా సినిమాపై అనుకూల – వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. అందాల తార సన్నీ లియోన్ ని సినిమాలో కౌర్ అనే పదంతో ఎందుకు వ్యవహరించారంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ” ఆమె పోర్న్ స్టార్ గా నటించింది. మతం మారి క్రైస్తవంలోకి వెళ్లింది. సిక్కు మతంలో సింగ్ – కౌర్ పేర్లకు ఎంతో విలువ – గౌరవం – ప్రాధాన్యం ఉంటాయి. సినిమాకు ఆ పేరు వాడడం వల్ల సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయి. అందుకే ఆ పేరు తొలగించండి” అని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రతినిధి దల్జీత్ సింగ్ బేడీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అన్ని బయోపిక్ లాగే సన్ని లియోన్ బయోపిక్ కూడా వివాదాలతో ప్రారంభమైంది. ఈ వివాదమే చిత్రాన్ని సూపర్ హిట్ కూడా చేయవచ్చునేమో… చూడాలి.