గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్

0Simbu-And-Tamanna-AAA-Movieఓ రేంజ్ కి వచ్చిన తర్వాత గ్లామర్ గా కనిపించమంటే హీరోయిన్లు ఎక్కడ లేని బెట్టు చేసేస్తుంటారు. మొదట బికినీలు వేసుకుని కెరీర్ లో అడుగులు వేసుకున్న రోజులను పూర్తిగా మర్చిపోయి.. కేవలం తమ నటనా పటిమను చూపించేందుకే సినిమాలు చేస్తున్నామంటూ చాలానే కబుర్లు చెబుతుంటారు పలువురు భామలు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకూ.. తను ఏ స్థాయికి చేరినా.. స్టార్ హీరోయిన్ అనిపించుకున్నా సరే.. గ్లామర్ యాంగిల్ ను మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు.

ప్రస్తుతం తమన్నా చేతిలో ఉన్న సినిమాలు తక్కువే. కానీ వీటిలో అంబానవన్.. అసరాధవన్.. అదంగధవన్(ఏఏఏ) అనే టైటిల్ పై శింబు మూడు పాత్రలలో నటిస్తున్న చిత్రంలో నటిస్తుంది మిల్కీ. శింబు చేసే మూడు రోల్స్ లో.. అశ్విన్ తాత పాత్రకు జోడీగా తమన్నా యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలో శింబు- తమన్నాలు కలిసి నటించిన పాటలోని కొన్ని స్టిల్స్ ను పోస్టర్లుగా రిలీజ్ చేశారు. గ్లామర్ పంచడంలో ఏ మాత్రం తక్కువ చేయలేదు తమ్ము. స్కిన్ టైట్ డ్రెస్సులు.. చిట్టిపొట్టి బట్టలు.. నడుం ఒంపులు.. క్లీవేజ్ షోకులు.. మినీ స్కర్టులు.. గ్లామర్ యాంగిల్ లో ఎన్నెన్ని యాంగిల్స్ ఉంటాయో.. అన్నిటినీ ఈ అశ్విన్ తాత కోసం ఒలికించేసింది మిల్కీ గాళ్.

ఏఏఏ మూవీలో తాతతో కలిసి తమన్నా ఒలికించిన అందాలను చూస్తుంటే.. గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ తానే అని ఎలుగెత్తి చాటుతున్నట్లుగా అనిపించడంలో తప్పేమీ లేదు.