మాజీ ప్రియుడితో కలిసి నయనతార సరసం!

0Simbu-nayantara-sarasudu-reహీరోయిన్ నయతార, తమిళ హీరో శింబు ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. అప్పట్లో వారి బెడ్రూం రొమాన్స్, ముద్దులకేళి ఫోటోస్ ఇంటర్నెట్లో లీక్ అయి సంచలనం క్రియేట్ చేశాయి. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని భావించారు. కానీ విడిపోయారు. విడిపోయిన తర్వాత కొంతకాలంగా కలిసి పని చేయని ఈ జంట…. మళ్లీ స్నేహితులు అయ్యారు. ఇపుడు కలిసి సినిమాలు కూడా చేస్తున్నారు.

శింబు, నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం తెలుగులో ‘సరసుడు’ పేరుతో విడుదల కాబోతోంది. హీరోయిన్లు ఆండ్రియా, ఆదాశర్మ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శింబు తండ్రి టి. రాజేందర్‌ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్‌, జేసన్‌ రాజ్‌ ఫిలింస్‌ బేనర్స్‌పై నిర్మించారు.

ఇటీవల రాక్‌స్టార్‌ మంచు మనోజ్‌ రిలీజ్‌ చేసిన ఈ చిత్రం ఆడియో మంచి హిట్‌ అయ్యింది. ఈ చిత్రానికి శింబు సోదరుడు టి.ఆర్‌.కురళఅరసన్‌ అద్భుతమైన మ్యూజిక్‌తో పాటు ఎక్స్‌ట్రార్డినరీగా రీ-రికార్డింగ్‌ అందించారు. టి.రాజేందర్‌ ఈ చిత్రానికి పాటలు, మాటలు రాయడం మరో విశేషం.

శింబు, నయనతార విడిపోయిన తర్వాత వస్తోన్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో ఓ స్పెషల్‌ అటెన్షన్‌ నెలకొంది. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందింది. జూలై నెలలో ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత టి.రాజేందర్‌ మాట్లాడుతూ – ”రియల్‌ లైఫ్‌లో ఐటి రంగంలో పని చేసే యువతీ యువకులు ఎలా లవ్‌ చేసుకుంటున్నారు? ఎలా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా? లేదా? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా, ప్రజెంట్‌ యూత్‌కి కనెక్ట్‌ అయ్యేవిధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు.

ఈ చిత్రాన్ని పాండిరాజ్‌ చాలా బాగా తీశారు. ఈ చిత్రానికి మా చిన్నబ్బాయి కురళఅరసన్‌ చక్కని మ్యూజిక్‌ అందించాడు. విజువల్‌గా కూడా స్క్రీన్‌పై చాలా బాగుంటాయి. ఆడియోకి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో నటించారు. మెయిన్‌గా శింబు, నయనతారల మధ్య వచ్చే బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ సీన్స్‌ చిత్రానికే హైలైట్‌ అవుతుందని టి రాజేందర్ తెలిపారు.

శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ, సత్యం రాజేష్‌, సూరి, సంతానం, జయప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు, నిర్మాత: టి.రాజేందర్‌ ఎంఎ, సంగీతం: టి.ఆర్‌.కురళ్‌అరసన్‌, కెమెరా: బాలసుబ్రమణ్యం, ఎడిటింగ్‌: ప్రవీణ్‌-ప్రదీప్‌, ఆర్ట్‌: ప్రేమ్‌ నవాజ్‌, కొరియోగ్రఫీ: సతీష్‌, రచనా-సహకారం: బోస్‌ గోగినేని, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: వెంకట్‌ కొమ్మినేని, కో-ప్రొడ్యూసర్‌: శ్రీమతి ఉషా రాజేందర్‌, నిర్మాత: టి.రాజేందర్‌, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌.