హన్సికకు ఇల్లు కొనిచ్చిన రొమాన్స్ హీరో

0

simbu-new-house-for-hansikaసినీ పరిశ్రమల్లో ట్రెండ్ మారింది. ఇప్పుడు హీరోలు, హీరోయిన్లే రియల్ ప్రేమలో పడుతున్నారు. రీల్ పై పండించిన లవ్ రొమాన్స్ రియల్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో.. తెర పై జరిగే ప్రేమలను నిజజీవితంలో నిజం చేస్తున్నారు. యంగ్ హీరోలు, హీరోయిన్లు ప్రేమ పేరుతో సాగర తీరానికి వెళ్లి సరస సల్లాపాలు తీర్చుకుంటున్నారు. అలాంటీ వారిలో కోలీవుడ్ జంట చిక్కింది. కోలీవుడ్ కుష్బూ ఇప్పుడు లవ్ లో పడిన విషయం తెలిసిందే.

కుష్బూ అంటే ఓల్డ్ నటి కాదు..కొత్త నటి హన్సిక. ఆమె లవర్, యంగ్ హీరో శింబు. శింబు-హన్సిక జంటగా నటిస్తున్న ‘వాలు’, ‘వేటెమన్నన్‌’ సెట్స్‌పై ఉన్నాయి. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ చిగురించినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ పెదవి విప్పలేదు. వారి ప్రేమ నిజమైతే పెళ్లికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తానని శింబు తండ్రి టి.రాజేందర్‌ ఇది వరకే ప్రకటించారు. హన్సిక, తానూ ప్రేమించుకుంటున్న మాట నిజమేనని, పెళ్లే తరువాయి అంటూ అసలు విషయాన్ని ఇటీవలే బయటపెట్టాడు శింబు. అంతేకాదు…హన్సిక కోసం అద్భుతమైన నివాసాన్ని కూడా నిర్మిస్తున్నాడట. చెన్నై శివారులో ఇది సిద్ధమవుతోందట. పెళ్లి తర్వాత ఈ ఇంట్లోనే ఉండాలని భావిస్తున్నాడట. శింబు వ్యక్తిత్వం నచ్చే హన్సిక మనసిచ్చినట్లు ఆమె సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.

హన్సికకు ఇల్లు కొనిచ్చిన రొమాన్స్ హీరో, simbu new house for hansikaPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home