కోలీవుడ్ బ్యాడ్ బాయ్ తో సూపర్ డైరెక్టర్

0ప్రతి సినీ పరిశ్రమలోనూ హీరోల్లో కొందరు బ్యాడ్ బాయ్స్ ఉంటారు. సినిమాలతో కంటే వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు హీరోలు. తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి అలాంటి ఇమేజ్ ఉన్న హీరో శింబు. అతడి గురించి వివాదాలు ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. మధ్యలో కొన్నేళ్లు సినిమాలు కూడా మానేసి వివాదాల్లోనే మునిగి తేలాడతను. ఈ మధ్య తన దగ్గర వెయ్యి కోట్లున్నాయంటూ అతను చేసిన ప్రకటన ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే.

ఐతే ఇక వివాదాలకు దూరంగా ఉంటూ సినిమాల మీద ఫోకస్ పెట్టాలని శింబు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు లైన్లో పెడుతున్నాడతను. ఆల్రెడీ మణిరత్నం దర్శకత్వంలో శింబు ఒక మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తనకు ‘విన్నైతాండి వరువాయ’ లాంటి మెమొరబుల్ సినిమాను అందించిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనూ మళ్లీ పని చేయబోతున్నట్లు అతను ప్రకటించాడు. తాజాగా శింబు మరో క్రేజీ ప్రాజెక్టును ఓకే చేశాడు.

‘చెన్నై-28’తో మొదలుపెట్టి ‘సరోజ’.. ‘గోవా’.. ‘గ్యాంబ్లర్’.. ‘రాక్షసుడు’ లాంటి వైవిధ్యమైన సినిమాలు అందించిన విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు నటించబోతున్నాడు. ప్రస్తుతం ‘పార్టీ’ అనే వెరైటీ సినిమా తీస్తున్న వెంకట్.. దీని తర్వాత శింబుతో పని చేయబోతున్నాడు. ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వెంకట్ ప్రభు ఎంటర్టైనింగ్ సినిమాలకు పెట్టింది పేరు. శింబు సరిగ్గా నటిస్తే అతడి సినిమాల్లోనూ ఎంటర్టైన్మెంట్ బాగానే పండుతుంది. మరి ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలాంటి వినోదాన్నందిస్తుందో చూడాలి.