మిస్ ఇండియా రేస్ లో టాలీవుడ్ హీరోయిన్

0


Simran-Choudharyబ్యూటీ కాంటెస్ట్ లలో పెరిగిన తర్వాత హీరోయిన్లుగా మారడం చాలామందికి జరుగుతూనే ఉంటుంది. కానీ ముందు యాక్ట్రెస్ గా చేసి.. ఆ తర్వాత మిస్ ఇండియా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం కాసింత అరుదైన విషయమే. 2014లో వచ్చిన హమ్ తుమ్ మూవీ ద్వారా టాలీవుడ్ అరంగేట్రం చేసిన బ్యూటీ సిమ్రన్ చౌదరి.

సిమ్రన్ ఆ తర్వాత సినిమాలు చేయకపోయినా.. అందాల పోటీల్లో మాత్రం దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ భామ మిస్ ఇండియా టైటిల్ కోసం పోటీ పడుతుండడం విశేషం. ఫెమినా మిస్ ఇండియా 2017 కాంపిటీషన్ లో ఫైనల్ వరకూ వచ్చేసింది సిమ్రన్ చౌదరి. ఈ నెల 25న రాజస్థాన్ లో జరగనున్న ఫైనల్ అందాల పోటీల్లో సిమ్రన్ చౌదరి పాల్గొంటుండగా.. ఈ రేసులో మరో 29మందితో కలిసి పోటీ పడనుంది సిమ్రన్. మిస్ ఇండియా టైటిల్ రేస్ లో విన్నర్ గా నిలిచిన భామ.. మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కు పంపిస్తారు. సిమ్రన్ చౌదరి.. ఈ ఏడాది మిస్ ఇండియాగా ఎంపికయ్యే అవకాశాలు బోలెడన్ని ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ తెలంగాణ 2017 పోటీల్లో నెగ్గిన సిమ్రన్ చౌదరి.. మిస్ ఇండియా టైటిల్ దక్కించుకునేందుకు తెగ ఉత్సాహంగా ఉంది. మరో వారంలో జరగనున్న ఈ అందాల పోటీల కోసం గ్లామర్ అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.