స్టార్ హీరోతో సిమ్రన్ రీ ఎంట్రీ

0Simranసౌత్ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో వెలిగిపోయిన ముంబై బ్యూటీ సిమ్రన్. తెలుగులో టాప్ హీరోలందరినీ సినిమాలు చేసేసిన రికార్డ్ కూడా ఉంది. పెళ్లి చేసుకునే వరకూ తెగ సినిమాలు చేసేసిన సిమ్రన్.. మూడేళ్ల క్రితం రీఎంట్రీ ఇచ్చి గెస్ట్ కేరక్టర్లతో ఇరగదీస్తోంది. ఇప్పుడీ భామకు ఓ బంపరాఫర్ తగిలిందని తెలుస్తోంది.

త్వరలో ఈమె ఓ పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించబోతోందిట. దాదాపుగా సినిమాను లీడ్ చేసే పాత్ర అని తెలుస్తోంది. మరోవైపు.. ఈ చిత్రంలో అరవింద్ స్వామితో కలిసి నటించనుంది సిమ్రన్. తని ఒరువన్.. ధృవ లాంటి సినిమాల్లో నెగిటివ్ కేరక్టర్లతో ప్రస్తుతం తన కెరీర్ లోనే టాప్ ఫాంలో ఉన్న అరవింద్ స్వామితో మూవీ అంటేనే ఆసక్తి రెట్టింపయిపోతోంది. అయితే.. ఈ చిత్రంలో లీడ్ కేరక్టర్లు వీళ్లిద్దరే అయినా.. ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉండవట. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా సిమ్రన్ నటన ఈ మూవీకి హైలైట్ కానుందని అంటున్నారు.

ఒకవైపు ఫామ్ లో ఉన్న అరవింద్ స్వామి.. మరోవైపు దశాబ్దం పాటు ఇండస్ట్రీని ఏలేసిన సిమ్రన్.. కాంబినేషన్ కే తెగ క్రేజ్ వచ్చేస్తోంది. ఈ మూవీతో మళ్లీ తనకు పూర్వ వైభోగం వచ్చేస్తుందని ఈ సీనియర్ బ్యూటీ ఆశలు పెట్టేసుకుంది. రీమేక్ మూవీస్ కి పేరెన్నిక గన్న తమిళ దర్శకుడు సెల్వ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.