సజిత్ ఖాన్ నా దుస్తులను తొలగించమన్నాడు.. శరీరం చూడాలన్నాడు..

0

బాలీవుడ్ దర్శకుడు సజిత్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేసే మహిళల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఊపందుకున్న వేళ.. పలు రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బహిర్గతం చేస్తున్నారు. కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు తమకు జరిగిన దారుణ ఘటనలపై ధైర్యంగా వెల్లడిస్తున్నారు.

ఇటీవల బాలీవుడ్ నటుడు నానా పటేకర్, అలోక్ నాథ్‌లపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు సజిత్ ఖాన్‌పై సలోనీ చోప్రా లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ నటీమణి సిమ్రాన్ సురి కూడా సజిత్ ఖాన్‌పై ఫిర్యాదు చేసింది. 2012వ సంవత్సరం ఓ కొత్త సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. తనను ఇంటికి రావాల్సిందిగా సజిత్ పిలిచాడు.

తాను ఆయన ఇంటికెళ్లినప్పుడు ట్రెడ్‌మిల్‌లో వున్నాడు. తన శరీరాకృతి ఎలా వుందో చూడమన్నాడు. ”ఆ తర్వాత నా దుస్తులను తొలగించమన్నాడు. అంతే నేను షాక్ అయ్యాను. నేను దర్శకుడిని నీ శరీరాన్ని చూడాలి అన్నాడు. కానీ నేను నా దుస్తులను తొలగించలేదు. అయితే ఆయనే నా దుస్తులకు తొలగించేందుకు సజిత్ ప్రయత్నించాడు.

నేను తిట్టడం మొదలెట్టాక.. అరవకు అమ్మ పక్కనే వుందంటూ నా నోరు మూసేశాడు. కానీ అతని నుంచి ఎలాగోలా తప్పించుకుని.. అక్కడ నుంచి తప్పించుకున్నాను. తర్వాత సజిత్ నాకు ఫోన్ చేశాడు. ఇద్దరం కలిసి పని చేయాలంటే.. ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్నాడు. అప్పుడు అతనిని వదల్లేదు. తిట్లదండకం అందుకున్నాను.

ఈ విషయం బయటికి చెప్తే ఎవ్వరూ నమ్మరనుకున్నాను. కానీ ఇప్పడు సజిత్ గురించి చాలామంది తమకు జరిగిన చేదు అనుభవాల్ని చెప్తున్నారు. అందుకే అదే ధైర్యంతో మాట్లాడుతున్నాను” అంటూ సిమ్రాన్ సురి చెప్పింది.
Please Read Disclaimer