షారుఖ్ స్టార్ ఇమేజ్ నా వల్లే పడిపోయింది..

0

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రముఖ సింగర్ అభిజిత్ భట్టాచారి హాట్ కామెంట్ చేశారు. ముంబైలోని ఇండియా టుడే సఫాయ్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న అభిజిత్ తాను షారుఖ్ ఖాన్ కు ఎందుకు పాటలు పాడడం లేదో కారణాలు వివరించాడు.

90వ దశకంలో షారుఖ్ నటించిన బ్లాక్ బస్టర్స్ హిట్స్ అయ్యాయంటే అంతా తన చలువేనన్నారు. తాను పాటలు పాడడం వల్లే షారుఖ్ సూపర్ స్టార్ అయ్యాడని పేర్కొన్నారు. కానీ తనకు జరిగిన అవమానంతో షారుఖ్ కు పాటలు పాడడం మానేసానని.. అందుకే ఇప్పుడు షారుఖ్ ఖాన్ స్టార్ ఫేం పడిపోతోందని సంచలన కామెంట్స్ చేశాడు.

2009లో వచ్చిన షారుఖ్ మూవీ ‘బిల్లు బార్బర్’ తర్వాత అభిజిత్ షారుఖ్ సినిమాలకు పాటలు పాడడం లేదు. షారుఖ్ నటించిన ‘మైహూనా’ సినిమాకు తాను పాటలు పాడినా తన పేరును వేయలేదని.. ‘ఓంశాంతి ఓం’ సినిమాలోనే తన పేరును చివరన వేసి అవమానించారని అభిజిత్ వాపోయాడు. అందుకే ఆత్మాభిమానం దెబ్బతిని అతడికి పాటలు పాడడం లేదన్నారు. తాను పాటలు పాడడం మానేసిన తర్వాత షారుఖ్ గ్రాఫ్ పడిపోయిందని వివరించాడు.
Please Read Disclaimer