మీటూ.. సింగర్ కార్తీక్ పేరు తెరపైకి..

0

గాయకుడు కార్తీక్.. సౌత్ ఇండియాలోనే మెలోడీ పాటలకు పెట్టింది పేరు. మృదువైన గొంతుతో ఆయన పాడిన పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ ఎన్నో హిట్స్ సొంతం చేసుకొని మచ్చ లేని గాయకుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు..

మీటూ ఉద్యమం దెబ్బకు సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులు ఒక్కొటొక్కటిగా బయటకు వస్తున్నాయి. బాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమంలో ఎంతో మంది మహిళా నటులు హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపులను బహిరంగంగా చెబుతూ దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నారు. ఇప్పుడీ ఈ మీటూ లైంగిక వేధింపుల ఆరోపణల్లో గాయకుడు కార్తీక్ పేరు రావడం ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.

తాజాగా ఓ అజ్ఞాత మహిళ.. గాయకుడు కార్తీక్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కార్తీక్ తనకు లైంగికంగా రెచ్చగొట్టే సందేశాలు పంపించాడని.. లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ మెసేజ్ ల వల్ల తాను ఇబ్బందులు పడ్డానన్నానని.. కార్తీక్ వల్ల తాను అతడితో కలిసి పనిచేయడాన్ని కూడా మానేశానని ఆరోపించింది. ఉద్యోగం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది.

కార్తీక్ ఇండస్ట్రీలో తనదైన పాటలతో క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోలేదు. తాజాగా ఓ అజ్ఞాత మహిళ కార్తీక్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. మరి ఇవి నిజమా కాదా.? వీటిపై కార్తీక్ ఎలా స్పందిస్తాడనేది వేచి చూడాలి.
Please Read Disclaimer