స్లో మోషన్ అంటూ రచ్చ చేస్తున్నారుగా

0

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ‘భారత్’ జూన్ 5 న రంజాన్ పండగ సందర్భంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ సినిమా నుండి ‘స్లో మోషన్ మే’ అంటూ ఒక పాటను రిలీజ్ చేస్తున్నామంటూ వీడియో టీజర్ వదిలారు. ఎలా ఉంది అని ఒక్క ముక్కలో చెప్పాలంటే… కెవ్వు కేక.

అసలే ఒకవైపు కండల వీరుడు సల్లూ భాయ్. ఆయనది అదో రకమైన నాట్యం. కొరియోగ్రాఫర్లకు కూడా కొరుకుడుపడని.. అసలే మింగుడుపడని స్టెప్పులు వేస్తాడు. ఫ్యాన్సేమో ఆయన కాలో చెయ్యే కదిపితే చాలు.. అదే మహాభాగ్యం అంటూ సంబరాలు చేసుకుంటారు. ఆయన ఇస్టైల్ కు తగ్గట్టే ఈ పాట స్లో మోషన్ లో సాగుతుంది. సల్మాన్ స్టెప్స్ కూడా కళాత్మకంగా సాగుతాయి. ఇందాకటి నుంచి సల్లూ భాయ్ గురించే చెప్పుకుంటూ పోతున్నాం ఆయన పక్కన డ్యాన్స్ చేసే సెక్సీ భామ.. కాల్విన్ క్లెయిన్ బ్యూటీ దిశా పతాని గురించి చెప్పుకోవద్దా? మొదటిసారి సల్మాన్ పక్కన అవకాశం రావడంతో గ్లమరసం చిందించి.. వయ్యారం హొయలు రంగరించి మరీ భాయ్ కి పోటీగా డ్యాన్స్ చేసింది. అంత బడా స్టార్ పక్కన ఉన్నా చూపులను తనవైపు తిప్పుకునేలా ఉంది.

అసలు ఈ పాట టీజర్లోనే చార్ట్ బస్టర్ కళ ఉట్టిపడుతోంది. ఆలస్యం ఎందుకు.. టీజర్ చూసేయండి. స్లో మోషన్ లో చిరునవ్వు నవ్వండి. అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ దిశాలతో పాటుగా కత్రినా కైఫ్.. టబు.. నోరా ఫతేహి.. జాకీ ష్రాఫ్.. సునీల్ గ్రోవర్… ఆసిఫ్ షేక్.. సోనాలి కులకర్ణి ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అందించిన వారు విశాల్ – శేఖర్ ద్వయం.
Please Read Disclaimer