సెట్ లో మహారాణి సమంత

0సమంత పెళ్లి తరువాత కూడా తన జోరు కొనసాగిస్తోంది. మహాన‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ‘మ‌హాన‌టి’ సినిమా షూటింగ్‌ ముగించింది. ‘రంగ‌స్థలం’ సినిమా షూటింగ్‌తో పాటు త‌మిళ సినిమా ‘ఇరుంబు థిరై’ షూటింగ్ పూర్తి చేసుకుంది.

మహానటి షూటింగ్ పూర్తి సందర్భంగా ఓ ఫోటో ను పోస్ట్ చేసింది. మాహానటి’ సెట్లోనే ఇలా కుర్చీలో కూర్చుని చిన్నపాటి కునుకు తీస్తున్న సమంత ఫోటో ఇది. ‘ష్‌.. మేడమ్‌ నిద్రపోతోంది’ అంటూ పక్కనే తన బృందం చేరి ఆమెకి సపర్యలు చేస్తున్నట్టు కనిపిస్తుంది.

‘మహానటి’ పూర్తైంది. ఈ నెలలో మూడు సినిమాల షూటింగ్‌ పూర్తి చేసుకున్నా. వైజయంతి మూవీస్‌ సంస్థ, నాగ్‌అశ్విన్‌ తీస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో నటించడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన అనుభూతిని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’అని ట్వీట్ చేసింది సామ్.