డ్రైవర్ సెలూన్.. బన్ని వైఫ్ గెస్ట్

0

బాలీవుడ్ లో స్టార్ హీరోల భార్యామణులు రిబ్బన్ కటింగ్ ఈవెంట్లు – పార్టీలు అంటూ నిరంతరం సందడి చేస్తుంటారు. కానీ ఆ కల్చర్ మాత్రం టాలీవుడ్ లో పెద్దంతగా కనిపించదు. అక్కడ భార్యామణులు లక్షల్లో ఆదాయ ఆర్జన చేస్తుంటారు. కానీ ఇక్కడ అలాంటి ఆలోచనలేవీ అస్సలు కనిపించనే కనిపించవు.

అయితే లేటెస్టుగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి హైదరాబాద్ లోని బోరబండలో ఓ సెలూన్ లాంచ్ కి రిబ్బన్ కట్ చేయడం అభిమానుల్లో చర్చకొచ్చింది. అయితే స్నేహారెడ్డి కి ఇలాంటి వాటితో అసలు టచ్ లేనేలేదు. స్టార్ వైఫ్ అయినా డీసెంట్ ఫ్యామిలీ ఎఫైర్స్ తప్ప ఇలా పబ్లిక్ అప్పియరెన్సులేమీ ఉండవు. అయితే తమ వద్ద పని చేసే కార్ డ్రైవర్ భార్యామణి సొంతంగా ఓ బ్యూటీ సెలూన్ పెట్టుకుంటే – దాని ప్రారంభోత్సవానికి స్నేహ వెళ్లారట. ఈ సందర్భంగా ఆ కుటుంబం అంతా స్నేహారెడ్డితో కలిసి ఫోటోలు దిగారు. పని వాళ్లకు ఇచ్చే గౌరవం – మర్యాద ఇది. అంత మంచి మనసును చూపించినందుకు ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీ.

బాలీవుడ్ లో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ – టాలీవుడ్ లో రామ్ చరణ్ భార్యామణి ఉపాసన కొణిదెల ఈ తరహాలో ఈవెంట్లకు వెళుతుంటారు. అయితే అదంతా తమ కుటుంబంతో అనుబంధం ఉన్న వాళ్ల కోసమే. ధనార్జన కోసం అయితే కానే కాదు. ఇదో మంచి కల్చర్ అనే చెప్పాలి.
Please Read Disclaimer