నలుగురితో సహజీవనం చేశా..: ముమైత్‌ఖాన్‌

0mumaith-khanఐటెంబాంబ్‌గా ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్లు తన హవా సాగించిన హాటీ ముమైత్‌ఖాన్‌కు ఇప్పుడు అవకాశాలే కరువయ్యాయి. నాలుగేళ్ల క్రితం ఐటెంగా రెచ్చిపోయిన ముమైత్‌కు కొత్త వారు రావడం వల్ల పెద్దగా అవకాశాలే లేవు. కొన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న ఈ అమ్మడు తాజాగా అవకాశాల కోసం మీడియాలోకి తరుచుగా వస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ముమైత్‌ ఖాన్‌ తన గురించి షాకింగ్‌ నిజాలు చెప్పింది. ఇది వరకు డబ్బును ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేసేదానినని, ఇకపై అలా చేయకూడదు అని ముమైత్‌ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఒక వ్యక్తి కోసం తాను సర్జరీ చేయించుకున్నానని ఆ సర్జరీ కోసం 27లక్షలు అయ్యిందని, ఇకపై అలా ఎవరి కోసం సర్జరీలు చేయించుకోవొద్దు అని డిసైడ్‌ అయ్యిందట.

అంతేకాకుండా గతంలో తాను నలుగురితో సహజీవనం చేశానని ఈ అమ్మడు ఏ మాత్రం జంకు లేకుండా చెప్పింది. మొదటి వ్యక్తితో నాలుగేళ్ల పాటు సహజీవనం చేశానని, ఆ తర్వాత తన పద్దతి నచ్చకపోవడంతో విడిపోయాం అని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.ఇక రెండో వ్యక్తితో మూడున్నర ఏళ్లు రిలేషన్‌ ఉందట. మూడో వ్యక్తితో రెండేళ్లు పెళ్లి కాకుండానే కాపురం చేసి అనంతరం పలు విభేదాల వల్ల విడిపోయాం అని చెప్పింది. ఇక చివరి వ్యక్తితో ఎక్కువ కాలం ఉండలేకపోయా అందుకే ఏడాదిన్నరకే అతన్ని వదిలేశా అంటూ ముమైత్‌ చాలా ధైర్యంగా తన గత ఎఫైర్‌ల గురించి చెప్పేసింది. ఇకపై ఎవరితో సంబంధాలు పెట్టుకోకూడదు అని నిశ్చయించుకుందట. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉన్నానని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.