చిరంజీవిని రాళ్ళతో కొట్టి.. కాళ్లు విరగ్గొడతాం : శోభారాణి

0

sobha-raniవిభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవిని రాళ్లతో, చెప్పులతో కొట్టడమే కాకుండా కనిపిస్తే కాళ్లు విరగ్గొడతామని మాజీ ప్రజారాజ్యం మహిళా నేత శోభారాణి హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఆమె తన నివాసంలోనే ఆమరణ నిరహారదీక్షకు దిగారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబ్పుల కోసం చిరంజీవి పార్టీని అమ్ముకున్నారని, ఇపుడు రాజకీయ పదవుల కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా భజన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై నోరెత్తని చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం ప్రజారాజ్యం పార్టీని స్థాపించినట్టు చెప్పడం వల్లే తాము నాడు పీఆర్పీలో చేరామని, ఇపుడు అదే సమైక్యాంధ్ర కోసం చిరంజీవి వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిని రాళ్లు, చీపుర్లతో కొట్టాలన్నారు. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ మంచి నటుడని నిరూపించుకున్నారని, ఇకపై చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోల చిత్రాల ప్రదర్శనను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న లక్ష్యంతో సోనియా గాంధీ.. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని చూస్తోందని ఆమె ధ్వజమెత్తారు. సోనియా గాంధీ దేశం విడిచి వెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమేనని శోభారాణి ప్రకటించారు.

చిరంజీవిని రాళ్ళతో కొట్టి.. కాళ్లు విరగ్గొడతాం : శోభారాణి, sobharani angry on chiranjeevi, sobharani blames chiranjeevi for telangana,




Please Read Disclaimer