లేడీ హాట్.. కప్పు హాటేనా?

0

2013 లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం సాధించడం.. కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై మెరవడంతో ఫ్యాషన్ రంగంలో పేరు తెచ్చుకుంది తెలుగు బ్యూటీ.. తెనాలి బ్యూటీ శోభిత ధూళిపాళ. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి హాటు హాటు ఫోటో షూట్లకు ఏమాత్రం అభ్యంతరం చెప్పే టైపు కాదు. శోభిత పేరు తెలుగు ప్రేక్షకులకే కాదు బాలీవుడ్ సినిమాలు చూసేవారికి కూడా పరిచయమే.

ముంబై బ్యూటీల లాగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. క్యాప్షన్ ఏదీ ఇవ్వలేదు గానీ ఒక కాఫీ కప్పు ఎమోజిని మాత్రం పెట్టింది. ఇక ఫోటో ఎలా ఉంది అంటే బీచిలో ఉండే రిలాక్సింగ్ చైర్ లో పడుకుని తన కాళ్ళను.. సముద్రం వ్యూ ను రెండిటిని కవర్ చేసేలా తీసింది. చేతిలో ఒక కప్పు పట్టుకుంది. ఆ కప్పు వాలకం చూస్తుంటే ఏ కాఫీ కప్పో లేదా టీ కప్పో అనుకోవాలి. బీచ్ ఇసుక బ్యాక్ గ్రౌండ్ లో కలిసిపోయినట్టుగా శోభిత కాళ్ళు చాకొలేట్ షేడ్ లో సెక్సీగా ఉన్నాయి.

ఈ ఫోటోకు నెటిజనులు రకరకాల కామెంట్లు పెట్టారు. కాళ్ళను.. సముద్రాన్ని భలే కవర్ చేసిందని ఒకరు.. హాట్ కాఫీ -హాట్ లెగ్స్ – హాట్ లేడీ అని ఒకరు.. కప్పులో హాట్ చాకొలేట్ ఉందా అని ఇంకొకరు ఆన్నారు. మరొకరు మాత్రం కప్పుకు అంటుకున్న అమ్మడి లిప్పు స్టిక్కు ను చూడమన్నారు. ఇంతకీ ఆ లిప్పు స్టిక్కు మీకు కనిపించిందా లేదా?
Please Read Disclaimer